మంచు విష్ణు(Manchu Vishnu) నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప(Kannappa) సినిమా మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి….మొదట్లో కొంచం ట్రోల్ స్టఫ్ లా కొన్ని సీన్స్ అనిపించినా కూడా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ఇంపాక్ట్ వలన సినిమా మీద అంచనాలు అయితే పెరిగి పోయాయి అని చెప్పాలి.
ఇక సినిమా ఆడియన్స్ ముందుకు ఇప్పుడు డీసెంట్ అంచనాల నడుమ ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా…. సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు అయితే పెరిగాయి అనే చెప్పాలి.
ట్రైలర్ లో కంటెంట్ కానీ విజువల్స్ కానీ అనుకున్న దాని కన్నా కూడా చాలా బెటర్ గా ఉండగా మెయిన్ క్యారెక్టర్స్ అన్నింటినీ హైలెట్ చేసినప్పటికీ కూడా మరోసారి సినిమా మేజర్ బజ్ కి కారణం అయిన ప్రభాస్ షాట్స్ ఉన్నవన్నీ కూడా సాలిడ్ ఇంపాక్ట్ నే క్రియేట్ చేశాయి…
మంచు విష్ణు డైలాగ్స్ అండ్ పెర్ఫార్మెన్స్ ట్రైలర్ వరకు పర్వాలేదు అనిపించేలా ఉండగా మోహన్ లాల్, అక్షయ్ కుమార్ మరియు మోహన్ బాబు లాంటి ఇతర పాత్రలు కూడా సాలిడ్ గానే ఉండబోతున్నాయి అని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది…
ఒక నాస్తికుడు అయిన హీరో ఎలా శివుడికి భక్తుడు అయ్యాడు అన్న పాయింట్ అందరికీ తెలిసిందే అయినా కూడా అద్బుతమైన స్టార్ కాస్ట్ అండ్ సాలిడ్ విజువల్స్ హెల్ప్ తో కన్నప్ప మూవీ ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపించే రేంజ్ కంటెంట్ తో…
ఆడియన్స్ ముందుకు రాబోతుందని అనిపిస్తుంది…అన్నీ అనుకున్నట్లు జరిగి ట్రైలర్ రేంజ్ లో సినిమా కూడా ఉండి….అలాగే ప్రభాస్ కంటెంట్ అనుకున్న రేంజ్ లో హైలెట్ అయితే కనుక మంచు విష్ణు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సాలిడ్ కంబ్యాక్ ఈ సినిమాతో సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. ఇక ట్రైలర్ కి 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి.