యాక్టర్ సుమంత్ రీసెంట్ టైం లో మళ్ళీ రావా సినిమా తో మెప్పించగా తర్వాత మళ్ళీ అలాంటి మంచి మూవీగా అంచనాలను పెంచిన సినిమా కపటధారి. కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమా తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు లో రీసెంట్ గా రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆడియన్స్ అంచనాలను అందుకోగలిగింది లాంటి విశేషాలను తెలుసు కుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ కి వస్తే…
ట్రాఫిక్ పోలిస్ అయిన హీరో కి క్రైం ఇన్వెస్టిగేషన్ చేయాలనీ ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ తనకి ఏ కేసు దొరకదు… అలాంటి టైం లో ఒక బ్రిడ్జ్ కింద అనుకోకుండా కొన్ని అస్తిపంజారాలని చూస్తాడు హీరో… అవి ఎవరివి వాళ్ళని ఎవరైనా చంపారా లేక ఆత్మహత్య లాంటి సందేహాలతో సినిమా స్టార్ట్ అవుతుంది…
ఆ కేసు ని హీరో ఎలా సాల్వ్ చేశాడు అన్నది మొత్తం మీద కథ.. ఇది అసలు కథ అయినా మెయిన్ ట్విస్ట్ లు సినిమాలో చాలానే ఉంటాయి, అవి అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పెర్ఫార్మెన్స్ పరంగా మరోసారి సుమంత్ సటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించాడు.
డైలాగ్స్ యాక్టింగ్ అన్నీ బాగున్నాయి… ఇక హీరోయిన్ నందిత ది చాలా లిమిటెడ్ రోల్ కాగా నాజర్ మరియి జయ ప్రకాష్ రోల్స్ మెప్పిస్తాయి, కథకి అవి కీలకం కూడా… ఇక కొన్ని సీన్స్ లో వెన్నెల కిషోర్ కూడా మెప్పిస్తాడు… మొత్తం మీద యాక్టింగ్ డిపార్ట్ మెంట్ అందరూ బాగా నటించారు. సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే… థీం సాంగ్ బాగానే ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది…
చాలా సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కథలో ఇన్వాల్వ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది, కానీ తర్వాత మంచి పాయింట్స్ తో మెప్పిస్తుంది… ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండగా సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది… ఇక డైరెక్షన్ పరంగా డైరెక్టర్ ఒరిజినల్ లో ఉన్నవి ఉన్నట్లు అలానే తీశాడు…
కొన్ని చిన్న చిన్న మార్పులు మినహా ఒరిజినల్ అలానే దించేశారు. కానీ ఒరిజినల్ లో కూడా కథ మధ్యలో కొంచం ట్రాక్ తప్పుతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఫస్టాఫ్ టేక్ ఆఫ్ కి టైం పడినా తర్వాత ఇంటర్వెల్ వరకు సినిమా ఎంగేజింగ్ గా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత సినిమా కొంచం పడుతూ లేస్తూ…
అనేక ప్రశ్నలు ఆడియన్స్ లో కలిగేలా చేయగా వాటికన్నింటికి ఆన్సర్స్ ని చివరి 40 నిమిషాల్లో వివరంగా తెలియజేయడం బాగుంటుంది, క్లైమాక్స్ మళ్ళీ కొంచం రొటీన్ గా అనిపిస్తూ ముగిసినా మొత్తం మీద మంచి సినిమా గా కపటధారి ఒరిజినల్ ఎలా మెప్పిస్తుందో అలా మెప్పిస్తుంది.
కొంచం లెంత్ పరంగా మరింత శ్రద్ధ తీసుకుని తగ్గించి ఉంటె మరింత క్రిస్ప్ గా సినిమా ఉండేది, అయినా కానీ ఒక్కసారి సినిమాలో ఇన్వాల్వ్ అయ్యాక సినిమా బాగానే మెప్పిస్తుంది. కానీ స్లో నరేషన్, ట్రాక్ తప్పడం లాంటివి కొంత ఇబ్బంది కలిగిస్తాయి. అయినా వాటిని పట్టించుకోకుండా సినిమా చూస్తె…
సినిమా బాగుంది అనిపిస్తుంది…మొత్తం మీద డిఫెరెంట్ జానర్ మూవీస్ చూడటం ఇష్టపడే వారికి సినిమా బాగానే నచ్చుతుంది, అలానే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండే మూవీస్ చూసేవాళ్ళు కూడా కొంచం ఓపికతో సినిమా చూస్తె బాగానే ఆకట్టుకునే అవకాశం ఉంది, సింపుల్ గా ఒకసారి ఈజీగా చూసేయోచ్చు ఈ సినిమా ని… సినిమాకి మా ఫైనల్ రేటింగ్ 2.75 స్టార్స్…