Home TRP రేటింగ్ రికార్డులు బ్రేక్ అవుతాయి అనుకుంటే…ఇంత తక్కువ TRP వచ్చిందేంటి!!

రికార్డులు బ్రేక్ అవుతాయి అనుకుంటే…ఇంత తక్కువ TRP వచ్చిందేంటి!!

3631
0

కోలివుడ్ స్టార్ హీరోలలో ధనుష్ కూడా ఒకరు, కెరీర్ లో ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్న ధనుష్ రీసెంట్ గా జగమే తంత్రం సినిమాతో డిజిటల్ లో పర్వాలేదు అనిపించుకోగా అంతకన్నా ముందు సమ్మర్ రేసులో థియేటర్స్ లో కర్ణన్ సినిమా తో సత్తా చాటుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయిన రోజున 100% ఆక్యుపెన్సీ తో రన్ అవ్వగా తర్వాత పరుగును 50% ఆక్యుపెన్సీ తో కొనసాగించింది కానీ త్వరగానే రన్ ని…

కంప్లీట్ చేసుకుంది. అయినా కానీ తక్కువ టైమే రన్ అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా నిర్మాతలు సినిమా పై ఎక్కువ ఖర్చు పెట్టడంతో ఈ సినిమా వలన నష్టాలు వచ్చాయి అని తర్వాత నిర్మించిన నారప్ప ని…

డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేశారు, అది వేరే విషయం కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం తక్కువ రన్ టైం లోనే ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ధనుష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది. అలాంటి ఈ సినిమా తర్వాత డిజిటల్ లో రిలీజ్ అయినా కానీ…

టెలివిజన్ లో త్వరగానే టెలికాస్ట్ చేయడం తో కచ్చితంగా కోలివుడ్ టాప్ TRP రేటింగ్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తుంది అనుకున్నారు అందరూ… కానీ అందరికీ శాకిస్తూ ఈ సినిమా కేవలం ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 9.37 రేటింగ్ ను మాత్రమె సొంతం చేసుకుని షాకిచ్చింది. ఇంత తక్కువ రేటింగ్ వస్తుందని ఎక్స్ పెర్ట్ చేయలేదు కానీ ఈ సినిమా టెలికాస్ట్ అయిన ఛానెల్…

జీ తమిళ్ లో ఇది సెకెండ్ హైయెస్ట్ రేటింగ్ అని అంటున్నారు. ఇది వరకు రోబో 2.0 సినిమాకి 11.53 రేటింగ్ దక్కగా తర్వాత సెకెండ్ హైయెస్ట్ రేటింగ్ అని అంటున్నారు. కానీ సినిమా పై సాలిడ్ బజ్ ఉన్న నేపధ్యంలో రికార్డులు క్రియేట్ చేస్తుంది అనుకుంటే సాదాసీదా రేటింగ్ తోనే సరిపెట్టుకుంది ఈ సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here