Home న్యూస్ బ్లాక్ బస్టర్ నా పేరు శివ కి సీక్వెల్ వచ్చింది…అసలు మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాంక్!!

బ్లాక్ బస్టర్ నా పేరు శివ కి సీక్వెల్ వచ్చింది…అసలు మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాంక్!!

0

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరోలలో కార్తీ కూడా ఒకరు, కెరీర్ మొదట్లో యుగానికి ఒక్కడు, ఆవారా లాంటి సూపర్ హిట్స్ ని సొంతం చేసుకున్న కార్తీ తర్వాత చేసిన నా పేరు శివ ఇక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. థ్రిల్లర్ నేపద్యంలో ఆ సినిమా ఇక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది, తర్వాత కార్తీ సినిమాలకు తెలుగు లో మంచి…

ఓపెనింగ్స్ ఎప్పుడూ సొంతం అయినా కెరీర్ స్టార్టింగ్ రేంజ్ లో హిట్స్ అయితే ఇక్కడ దక్కలేదు, రీసెంట్ టైం లో చినబాబు, ఖాకీ లాంటి సినిమాలు మెప్పించినా ఎక్కువ శాతం సినిమాలు బిలో యావరేజ్ గానే నిలిచాయి, లాస్ట్ ఇయర్ వచ్చిన సుల్తాన్ సెకెండ్ వేవ్…

ఇంపాక్ట్ వలన దెబ్బ పడగా ఇప్పుడు నా పేరు శివ కి సీక్వెల్ అంటూ నా పేరు శివ 2 పేరుతో ఓ పోస్టర్ ను సోషల్ మీడియాలో ఓ స్పెషల్ అప్ డేట్ వస్తుంది వస్తుంది అంటూ ఊరించి ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు, దాంతో కార్తీ ఈ సినిమా ఎప్పుడు తీశాడు ఒక్క తెలుగు లోనే…

ఈ సినిమాను ఎలా రిలీజ్ చేస్తున్నారు అంటూ అనుమానాలు రాగా సినిమా పోస్టర్ లో డైరెక్టర్ పేరు ఇతర డీటైల్స్ చూడటంతో అసలు విషయం అర్ధం అయింది… రజినీతో కబాలి తీసిన పా రంజిత్ కెరీర్ లో ఫస్ట్ మూవీ కార్తీతో చేశాడు. ఆ సినిమానే మద్రాస్… మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాను తెలుగు లో కూడా ఎప్పుడో…

తీసుకు రావాలి అనుకున్నా కుదరలేదు, లాస్ట్ ఇయర్ మద్రాస్ పేరుతోనే పోస్టర్ రిలీజ్ చేశారు కానీ సినిమా రిలీజ్ కాలేదు, దాంతో ఇప్పుడు తెలుగు లో హిట్ అయిన నా పేరు శివ టైటిల్ ని వాడుకుని ఆ సినిమా కి సీక్వెల్ లా పేరు పెట్టి జనవరి 13న సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు ఇప్పుడు…. మరి సినిమా ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here