తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరైన కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ సర్దార్ ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో దీపావళి కానుకగా రిలీజ్ అవ్వగా దీపావళి పోటిలో ఉన్న సినిమాలు అన్నింటిలో హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాగా నిలిచింది. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుని మెప్పించిందో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే…. పోలిస్ అయిన హీరో ప్రతీ విషయంలో ఎప్పుడూ వార్తల్లో నిలవాలని ట్రై చేస్తూ ఉండగా….
అనుకోకుండా ఆంధ్రా యూనివర్సిటీ నుండి కీలకమైన సైనిక రహస్యాలు మాయం అయ్యాయి అని తెలుసుకుని, ఆ కేసు ని సాల్వ్ చేస్తే తనకి ఇంకా పేరు వస్తుందని రంగంలోకి దిగుతాడు, తర్వాత ఆ కేసులో ఓ ట్విస్ట్ రివీల్ అవుతుంది, ఆ ట్విస్ట్ ఏంటి, తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… పెర్ఫార్మెన్స్ పరంగా పలు గెటప్స్ లో తన నటనతో కార్తీ ఫుల్ మార్కులు పడేలా నటించాడు… తన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి…
ఇక హీరోయిన్ రాశిఖన్నా పర్వాలేదు అనిపించగా చాలా టైం తర్వాత లైలా కూడా చిన్న రోల్ లో మెప్పించింది. చంకీ పాండే కూడా మెప్పించాగా సంగీతం బాగుండగా, బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పిస్తుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండగా డైరెక్షన్ విషయానికి వస్తే అభిమన్యుడు లాంటి సినిమాతో తెలుగు లో కూడా మెప్పించిన మిత్రన్ మంచి స్టొరీ పాయింట్ ని ఎంచుకున్నా…
కథ టేక్ ఆఫ్ కి కొంచం టైం తీసుకున్నాడు, కానీ తర్వాత జోరు అందుకున్న సినిమా అక్కడక్కడా కొంచం స్లో అయినా ఓవరాల్ గా మాత్రం సినిమా అయ్యాక ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలించడం ఖాయం అని చెప్పాలి. సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కార్తీ పెర్ఫార్మెన్స్, క్లైమాక్స్ బాగా వర్కౌట్ అవ్వడం, ఎమోషనల్ గా టచ్ అయ్యే సీన్స్ మెప్పించడం, స్క్రీన్ ప్లే బాగుండటం అని చెప్పాలి.
ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథ టేక్ ఆఫ్ కి కొంచం టైం పట్టడం, అక్కడక్కడా స్లో అవ్వడం లాంటివి అని చెప్పాలి. అయినా కానీ ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ ను కచ్చితంగా సర్దార్ సినిమా ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో బయటికి వచ్చేలా చేస్తుంది… సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 3 స్టార్స్…