Home న్యూస్ కార్తీ సత్యం సుందరం టాక్ ఏంటి….ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే!!

కార్తీ సత్యం సుందరం టాక్ ఏంటి….ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే!!

0

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరోల్లో కార్తీ కూడా ఒకరు….కెరీర్ లో కొన్ని మంచి విజయాలను సొంతం చేసుకున్న కార్తీ ఇప్పుడు అరవింద్ స్వామితో కలిసి చేసిన లేటెస్ట్ మూవీ “సత్యం సుందరం” (Sathyam Sundaram) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా…

తెలుగులో దేవర జోరులో ఈ సినిమాకి అనుకున్న రేంజ్ లో బజ్ క్రియేట్ అవ్వలేదు…అయినా కూడా తమిళ్ లో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు ఆడియన్స్ లో క్లాస్ మూవీస్ ఇష్టపడే వాళ్ళని బాగానే మెప్పించింది అని చెప్పాలి….

కథ పాయింట్ కి వస్తే….చాలా ఏళ్ళుగా ఊరిని కొన్ని కారణాల వలన వదిలేసిన అరవింద్ స్వామి, బాబాయ్ కూతురి పెళ్లి కోసం ఊరికి వస్తాడు…ఆ క్రమంలో దూరపు బందువు అయిన కార్తీ తో పరిచయం అవుతుంది…ముందు తన ప్రవర్తనతో చికాకు పడినా కూడా తర్వాత తన మనస్తత్వం తెలుసుకున్న తర్వాత వీళ్ళకి మంచి స్నేహం ఏర్పడుతుంది….ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

నార్మల్ స్టోరీ పాయింట్ తోనే వచ్చినా కూడా హృదయానికి హత్తుకునే సీన్స్ తో బాగానే మెప్పించింది సినిమా..కానీ లెంత్ కొంచం ఎక్కువ అవ్వడం, కథ డ్రాగ్ అయిన ఫీలింగ్ ఒక్కటి మైనస్ అయినా కూడా ఒక ఫ్లోలో వెళ్ళిపోయే సినిమా చాలా వరకు ఆకట్టుకునేలానే సాగింది అని చెప్పాలి…

పెద్దగా ఎక్స్ పెర్టేషన్స్ ఏమి పెట్టుకోకుండా చూస్తె సినిమా మంచి ఫీల్ గుడ్ మూవీగా మెప్పించింది…ఫ్రీ టైం దొరికితే కచ్చితంగా ఒకసారి సినిమాను చూసే ప్రయత్నం చేయండి…. ఇక బాక్స్ ఆఫీస్ లెక్కల విషయానికి వస్తే….

మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమాకి ఆల్ మోస్ట్ 24 వేల లోపు టికెట్ సేల్స్ జరిగాయి…ఆఫ్ లైన్ లో కూడా పర్వాలేదు అనిపించిన సినిమా మొదటి రోజు 80-85 లక్షల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను అందుకుందని అంచనా…. ఇక సినిమా వీకెండ్ లో బాగానే పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది….

ఓవరాల్ గా తెలుగు లో వాల్యూ బిజినెస్ రేంజ్ 4 కోట్ల దాకా ఉంటుందని అంచనా…సినిమా 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే డీసెంట్ హిట్ అనిపించుకుంటుంది…ఇదే జోరుని దసరా సెలవుల పాటు కొనసాగించగలిగితే టార్గెట్ ను అందుకోవచ్చు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here