Home న్యూస్ లాస్ట్ సినిమా డిసాస్టర్…అయినా కార్తీ సుల్తాన్ తెలుగు బిజినెస్ ఎంత జరిగింది అంటే!!

లాస్ట్ సినిమా డిసాస్టర్…అయినా కార్తీ సుల్తాన్ తెలుగు బిజినెస్ ఎంత జరిగింది అంటే!!

0

తమిళ్ తో పాటు తెలుగు లో కూడా సాలిడ్ క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోలలో కార్తీ కూడా ఒకరు, యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ లాంటి సినిమాలతో తెలుగు లో సూపర్ పాపులర్ అయిన కార్తీ అప్పుడప్పుడు ఫ్లాఫ్స్ కొట్టినా కానీ మళ్ళీ హిట్స్ తో తెలుగు లో తన మార్కెట్ ని స్టడీగా ఉంచుకున్నా రీసెంట్ టైం లో ఫ్లాఫ్స్ కొంచం ఎక్కువగానే రాగా ఈ గ్యాప్ లో 2019 లో…

ఆడియన్స్ ముందుకు పెద్దగా అంచనాలు లేని ఖైదీ సినిమాతో వచ్చిన కార్తీ ఆ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా బిజినెస్ 4.6 కోట్ల రేటు సొంతం చేసుకుంది. కానీ తర్వాత చేసిన దొంగ సినిమా అట్టర్ డిసాస్టర్ మూవీ గా..

నిలిచి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలను సొంతం చేసుకుంది. అయినా కానీ ఇప్పుడు కార్తీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కి తెలుగు లో సాలిడ్ బిజినెస్ దక్కడం విశేషం అని చెప్పాలి. కార్తీ మరియు రష్మిక ల కాంబినేషన్ లో రూపొందుతున్న అప్ కమింగ్ మూవీ సుల్తాన్…

అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఆ సినిమా ను తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్ గా క్రాక్ ని నైజాంలో డిస్ట్రిబ్యూషన్ చేసిన వరంగల్ శీను ఏకంగా 7.25 కోట్ల సాలిడ్ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇది నిజంగానే భారీ రేటు అని చెప్పొచ్చు.. బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఖైదీ సినిమా 8.5 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది.

కానీ దొంగ డిసాస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమా కి తెలుగు లో విపరీతమైన పోటి నెలకొన్న టైం లో రిలీజ్ అవుతున్నా ఈ రేంజ్ రేటు ని సొంతం చేసుకోవడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది. సినిమా ఏప్రిల్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here