8 ఏళ్ల క్రితం వచ్చిన కార్తికేయ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది, అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ2 సినిమా పోస్టర్ లు, టీసర్, ట్రైలర్ లతో మంచి ఆసక్తిని ఆడియన్స్ లో క్రియేట్ చేసింది అని చెప్పాలి. దాంతో ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూడగా కొంచం లేట్ అయినా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందొ తెలుసు కుందాం పదండీ..
ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే ప్రశ్నలకు సమాదానాలు వెతికే అలవాటు ఉన్న హీరో మొదటి పార్ట్ లో సుబ్రహ్మణ్యపురం మిస్టరీని చేదించగా ఇప్పుడు ఏకంగా ద్వారక మిస్టరీని శ్రీ కృష్ణుడి ఆభరణాలను వెంబడిస్తూ అనేక విషయాలను తెలుసుకుంటాడు, ఆ విశేషాలు ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
కథ పాయింట్ చాలా కొత్తగా ఫ్రెష్ గా ఉండటంతో అక్కడక్కడా కొన్ని సీన్స్ లాజిక్ లేనట్లు అనిపించినా కొన్ని సీన్స్ ఓవర్ ది టాప్ లా అనిపించినా కానీ కోర్ స్టొరీ పాయింట్ ని చక్కగా చెప్పే విషయంలో డైరెక్టర్ చందూ మొండేటి సక్సెస్ అవ్వడంతో ఫ్లాస్ అన్నీ పెద్దగా పట్టించుకునేలా లేకుండా పోయాయి.
సటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో నిఖిల్ బాగా యాక్ట్ చేసి మెప్పించాడు, తన లుక్స్ డైలాగ్స్ బాగున్నాయి, ఇక అనుపమ రోల్ పర్వాలేదు అనిపించగా అనుపం ఖేర్ రోల్ కూడా మెప్పిస్తుంది, శ్రీ కృష్ణుడి గురించి అనుపం ఖేర్ చెప్పే ఓ సీన్ గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం, ఇక శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష మిగిలిన యాకర్స్ అందరూ బాగానే మెప్పించారు…
సంగీతం పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పిస్తుంది, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొన్ని చోట్లా స్లో అయినా ఓవరాల్ గా బాగా మెప్పించాయి, ఇక సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్ గా ఉండగా విజువల్స్ చాలా రిచ్ గా మెప్పించాయి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉండటం విశేషం. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే….
కొత్త స్టొరీ పాయింట్ ని చాలా వరకు ఆడియన్స్ మెప్పు పొందేలా తెరకెక్కించడంలో చందూ మొండేటి సక్సెస్ అయ్యాడు, సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నా కానీ ఓవరాల్ గా మాత్రం సినిమా ఎండ్ అయ్యాక థియేటర్స్ నుండి బయటికి వచ్చే ఆడియన్స్ ఓ కొత్త మరియు మంచి సినిమా చూసిన భావనతో బయటికి రావడం ఖాయం….
మొత్తం మీద సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, కొత్త కథ పాయింట్, నిఖిల్ సటిల్డ్ పెర్ఫార్మెన్స్, రిచ్ విజువల్స్, గుడ్ డైరెక్షన్ అని చెప్పాలి, ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ముందే చెప్పినట్లు కొన్ని సీన్స్ లాజిక్ గా అనిపించకపోవడం, కొంచం లాగ్ అక్కడక్కడా ఉండటం లాంటి చిన్న చిన్న మైనస్ పాయింట్స్ అని చెప్పాలి.
మొత్తం మీద కార్తికేయ రేంజ్ లో థ్రిల్ చేయకపోయినా కానీ చాలా వరకు ఫ్రెష్ స్టొరీతో చాలా వరకు ఎంగేజింగ్ కథతో కార్తికేయ2 మెప్పించింది అని చెప్పాలి. కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కి మైతలాజికల్, మిస్టరీ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి ఈ కార్తికేయ2 కూడా మెప్పించడం ఖాయం. మొత్తం మీద సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 3 స్టార్స్….