Home న్యూస్ OTT లో రికార్డ్…ఏ సినిమాకి రాని రికార్డ్ కొట్టిన పెంగ్విన్!

OTT లో రికార్డ్…ఏ సినిమాకి రాని రికార్డ్ కొట్టిన పెంగ్విన్!

1242
0

కీర్తి సురేష్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన సైకో థ్రిల్లర్ మూవీ పెంగ్విన్… మహానటి తర్వాత లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ని ఎక్కువగా ఒప్పుకున్న కీర్తి సురేష్ నుండి వచ్చిన పెంగ్విన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కాకుండా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 4 కోట్ల రేంజ్ బడ్జెట్ తోనే తెరకెక్కిన ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కి గాను 7.5 కోట్ల రేంజ్ ఆఫర్ ని సొంతం చేసుకుంది.

కాగా డైరెక్ట్ డిజిటిల్ రిలీజ్ అయిన సినిమాలు ఈ మధ్య 5 కి పైగానే ఉన్నాయి.. వాటిలో ఏవి కూడా ఆడియన్స్ ని కంప్లీట్ గా అలరించలేక పోయాయి, పెంగ్విన్ కూడా ఆ కోవలోకే వచ్చే సినిమా నే అయినా కానీ సినిమా ఒక ఫ్లో లో అలా సాగిపోతుంది.

అదే సినిమా కి కలిసి వచ్చి ఈ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకున్న అన్ని సినిమాల్లో అత్యధిక సార్లు స్త్రీం అయిన సినిమా గా నిలిచిందని లేటెస్ట్ గా నిర్మాతలు ప్రకటించారు. సినిమా కి అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన సినిమా ల కన్నా కూడా…

అత్యధిక వ్యూస్ దక్కాయని వారు చెబుతున్నారు. అలాగే మేం ఒప్పందం కేవలం డైరెక్ట్ రిలీజ్ కే కాకుండా ఒక లిమిట్ తర్వాత వ్యూస్ కి కూడా ఒప్పందం చేసుకున్నామని, అందుకే 7.5 కోట్ల రేటుకే సినిమాను అమ్మామని చెబుతున్నారట. ఆ లెక్కన ఇక మీదట సినిమా కి గాను వాళ్లకి డైలీ వచ్చే వ్యూస్ ని బట్టి కూడా పెయిమేంట్ దక్కుతుందని సమాచారం.

తమిళ్, తెలుగు, మలయాళం ఇలా అన్ని భాషల్లో రిలీజ్ అవ్వడం సినిమా కి కలిసి వచ్చింది అని చెప్పాలి. అందుకే మిగిలిన డిజిటల్ రిలీజ్ సినిమాల కన్నా కూడా భారీ రేంజ్ లో వ్యూస్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. క్లైమాక్స్ మరింత బాగా తీసి ఉంటె రెస్పాన్స్ మరో రేంజ్ లో ఉండి ఉండేదేమో ఈ లెక్కన…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here