2019 టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్నప్పటికీ తర్వాత టైంలో వరుస ఫ్లాఫ్స్ తో స్లో డౌన్ అయిన బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన లేటెస్ట్ మూవీ కేసరి చాప్టర్2(Kesari Chapter 2 Movie) రీసెంట్ టైంలో తన కెరీర్ లోనే ది బెస్ట్ రివ్యూలను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…
2019 టైంలో వచ్చిన కేసరి బాక్స్ ఆఫీస్ దగ్గర 154 కోట్ల కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాంటి సినిమాకి సీక్వెల్ గా వచ్చిన కేసరి2 సినిమాకి రివ్యూలు ఆ సినిమా కన్నా బెటర్ గా ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ డే కేవలం 7.8 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ సొంతం అవ్వగా….
రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రోత్ ని అయితే చూపించింది కానీ అది అనుకున్న రేంజ్ లో అయితే లేదనే చెప్పాలి. సినిమాకి వచ్చిన యునానిమస్ రివ్యూల హెల్ప్ ఉన్నప్పటికీ కూడా రెండో రోజున సినిమా కేవలం 10 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని…
సొంతం చేసుకుంది ఇప్పుడు…దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 2 రోజులు పూర్తి అయ్యే టైంకి 17.8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో మాత్రం గ్రోత్ ని చూపెడుతూ దూసుకు పోతుంది.
అన్ని సెంటర్స్ లో రెండో రోజు మీద 25-30% రేంజ్ లో గ్రోత్ అయితే కనిపిస్తూ ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మూడో రోజు ఇప్పుడు 13-14 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా…ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే…
15 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ కలెక్షన్స్ కూడా సినిమాకి వచ్చిన టాక్ కి న్యాయం చేసే రేంజ్ లో అయితే లేవు… కానీ టాక్ బాగుంది కాబట్టి లాంగ్ రన్ లో ఎలాంటి జోరు చూపెడుతుందో చూడాలి ఇప్పుడు…