బాలీవుడ్ లో రీసెంట్ టైంలో ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి సీక్వెల్ మూవీసే…ఒక మంచి హిట్ మూవీ కి సీక్వెల్ వస్తుంది అంటే చాలు జనాలు ఎగబడి థియేటర్స్ కి వెళుతున్నారు. లేటెస్ట్ గా బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన కేసరి చాప్టర్2(Kesari Chapter 2 Movie) ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో…
గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా సినిమా 2019 టైంలో అక్షయ్ కుమార్ సూపర్ ఫామ్ లో ఉన్న సమయంలో చేసిన కేసరి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ కి సీక్వెల్ గా రూపొందింది. ఆ టైంలో ఆ సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకోగా టోటల్ రన్ లో 154 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని…
సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అలాంటి సినిమాకి సీక్వెల్ గా వచ్చిన కేసరి చాప్టర్2 సినిమా జలియన్‌వాలా భాగ్ ఇంసిడెంట్ చుట్టూ అల్లుకున్న కోర్ట్ డ్రామా గా రూపొందగా ట్రైలర్ ఆల్ రెడీ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
దాంతో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సినిమా సాలిడ్ గా కుమ్మేయడం ఖాయమని అందరూ అనుకోగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసి 3-4 డేస్ అవుతూ ఉన్నప్పటికీ కూడా బుకింగ్స్ ట్రెండ్ మాత్రం చాలా నిరాశ కలిగించే విధంగా ఉండగా…
కేవలం 2 కోట్ల రేంజ్ లోనే అడ్వాన్స్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ అవ్వగా తొలిరోజు టాక్ కనుక పాజిటివ్ గా ఉంటే 6-7 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండగా…
కేసరి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ కి సీక్వెల్ గా వస్తున్న సినిమా కి ఇలాంటి ఓపెనింగ్స్ చాలా నిరాశ కలిగించే ఓపెనింగ్స్ అనే అంటున్నారు. మరి సినిమా యునానిమస్ రెస్పాన్స్ ను ఏమైనా సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా అంచనాలను ఏమైనా మించుతుందో లేదో చూడాలి.