బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన కేసరి చాప్టర్2(Kesari Chapter 2 Movie)సినిమా రీసెంట్ గా హిందీలో రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ రివ్యూలను సొంతం చేసుకున్నా కూడా అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోలేక పోయిన ఈ సినిమా ఉన్నంతలో లాంగ్ రన్ లో…
అవలీలగా 100 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకున్నా అలా జరగలేదు… 5 వారాల్లో హిందీలో 92 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా…రీసెంట్ గా తెలుగు లో డబ్ చేసి రిలీజ్ చేశారు.
ఇక తెలుగు లో కూడా సినిమాకి మంచి రివ్యూలు సొంతం అయ్యాయి కానీ ఇక్కడ కలెక్షన్స్ మాత్రం వచ్చిన టాక్ కి ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించేలా అయితే సొంతం కాలేదు అనే చెప్పాలి. మొత్తం మీద ఇక్కడ మొదటి రోజున సినిమా 20 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా….
రెండో రోజున కలెక్షన్స్ పెరగాల్సిన చోట 15 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకుంది. దాంతో ఓవరాల్ గా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సినిమా 35 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా మూడో రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా మరోసారి…
15-20 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా వీకెండ్ కలెక్షన్స్ తెలుగు లో 50 లక్షల రేంజ్ లో ఉండే అవకాశం ఉండగా తెలుగు లో డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే సినిమా 2.25 కోట్ల రేంజ్ లో అయినా వసూళ్ళని అందుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా సినిమా టాక్ బాగున్నా నిరాశ పరిచే రిజల్ట్ నే సొంతం చేసుకునే అవకాశం ఉంది.