బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా బాలీవుడ్ లో రిలీజ్ అయ్యి యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన కేసరి చాప్టర్2(Kesari Chapter 2 Movie)సినిమా మంచి రివ్యూలు వచ్చినా కలెక్షన్స్ పరంగా మరీ అనుకున్న రేంజ్ లో జోరు చూపించలేక పోయింది.
కానీ సినిమా కి మంచి రివ్యూలు రావడంతో తెలుగులో వర్కౌట్ అవుతుందని రీసెంట్ గా సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు…అదే పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుందో అన్నది ఆసక్తి గా మారగా…
సినిమా మెయిన్ కథ పాయింట్ కి వస్తే జలియన్వాలా భాగ్ ఇంసిడెంట్ తర్వాత బ్రిటిష్ వాళ్ళ మీద ఒక లాయర్ వేసిన కేసు ని సాల్వ్ చేయడానికి ఎంత దూరం వెళ్ళాడు….ఇక బ్రిటిష్ వాళ్ళు ఆ కేసు ని ఎలాగైనా గెలవడానికి వేసిన ఎత్తులు ఎంటి అన్నది ఓవరాల్ గా స్టోరీ పాయింట్ అని చెప్పాలి.
స్క్రీన్ ప్లే పరంగా బాగా మెప్పించిన సినిమా తెలుగు డబ్బింగ్ కూడా బాగా ఆకట్టుకుంది….అక్షయ్ కుమార్ రీసెంట్ టైంలో చేసిన సినిమాలతో పోల్చితే చాలా బెటర్ కంటెంట్ తో మెప్పించే కేసరి2 ఓవరాల్ గా ఫ్రీ టైం ఉంటే కచ్చితంగా థియేటర్స్ లో చూడదగ్గ సినిమా అని చెప్పాలి.
కోర్ట్ ఎపిసోడ్ మొత్తం కూడా బాగా ఆకట్టుకుంటూ సాగగా మాధవన్ మరియు అక్షయ్ కుమార్ ల సీన్స్ చాలా బాగా మెప్పించాయి అని చెప్పాలి. కొంచం సీరియస్ అండ్ రియల్ ఇంసిడెంట్ లను బేస్ చేసుకుని తీసిన సినిమా అవ్వడంతో అక్కడక్కడా కొంచం స్లో అయినట్లు అనిపించినా కూడా…
ఓవరాల్ గా సినిమా అయ్యే టైంకి ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే ఆడియన్స్ థియేటర్స్ బయటికి రావడం మాత్రం ఖాయమని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 3 స్టార్స్…. ఈ వీకెండ్ ఆడియన్స్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఈ సినిమాను.