Home న్యూస్ 175…8….చరిత్రలో ఒకే ఒక్క సినిమా ఇది!!

175…8….చరిత్రలో ఒకే ఒక్క సినిమా ఇది!!

1379
0

2021 లో ఆల్ ఇండియా లెవల్ లో అల్టిమేట్ క్రేజ్ ను సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు రాబోతున్న మోస్ట్ వాంటెడ్ సీక్వెల్ మూవీ KGF చాప్టర్ 2… మొదటి పార్ట్ సాధించిన సెన్సేషనల్ క్రేజ్ తర్వాత రెండో పార్ట్ పై అంచనాలు మరో లెవల్ కి చేరుకోగా ఆ అంచనాలను అందుకోవాడానికి జులై లో రంగం లోకి దిగబోతున్న ఈ సినిమా అఫీషియల్ టీసర్ హీరో యష్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అవ్వగా…

అప్పటి నుండి సంచలన రికార్డులను తిరగరాస్తూ దూసుకు పోతుంది, ఈ క్రమం లో ఇండియన్ రికార్డులతో పాటు వరల్డ్ రికార్డులను కూడా సృష్టించిన ఈ సినిమా టీసర్ లేటెస్ట్ గా మరో మైలురాయిని అధిగమించి సంచలనం సృష్టించింది. చరిత్రలో ఏ టీసర్ కూడా సొంతం చేసుకోలేని రేంజ్ లో…

ఏకంగా 175 మిలియన్ అప్ డేటెడ్ వ్యూస్ ని సొంతం చేసుకుని ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసిన ఈ టీసర్ లైక్స్ పరంగా కూడా ఏకంగా 8 మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకుని మరో చరిత్ర సృష్టించి వరల్డ్ లోనే హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా…

ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది. ఈ రేంజ్ లో రచ్చ చేసిన ఈ టీసర్ ఇప్పటికీ వ్యూస్ ని సొంతం చేసుకుంటూనే ఉండగా ఇక సినిమా ట్రైలర్ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుంది అన్నది ఆసక్తి గా మారింది. సినిమా రీసెంట్ గా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకోగా బాక్స్ ఆఫీస్ బరిలో జులై 16 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను కూడా…

త్వరలోనే రిలీజ్ చేయాలనీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఆల్ ఇండియా లెవల్ లో రికార్డ్ లెవల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోబోతున్న ఈ సినిమా తెలుగు లో భారీ బిజినెస్ ను ఇప్పటికే సొంతం చేసుకుని తెలుగు డబ్ మూవీస్ లో బిగ్గెస్ట్ రేటు సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here