Home న్యూస్ 500 కోట్ల 2.0 ని…80 కోట్ల KGF ఓడించింది!!

500 కోట్ల 2.0 ని…80 కోట్ల KGF ఓడించింది!!

1146
0

     బడ్జెట్ కన్నా కంటెంట్ ఇంపార్టెంట్ అని మరోసారి రుజువు అయ్యింది, లాస్ట్ ఇయర్ ఇండియాలో అన్ని భాషల్లో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీస్ చాలానే వచ్చాయి వాటిలో సుమారు 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన రోబో 2.0 సినిమా ఒకటి అలాగే 80 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొంచిన KGF ఒకటి, కాగా ఈ రెండు సినిమాలో KGF రోబో 2.0 ని ఓడించి బెస్ట్ యాక్షన్ మూవీ గా నేషనల్ అవార్డ్ ను సొంతం చేసుకుంది.

రోబో 2.0 మరియు KGF సినిమాలు రెండు కేవలం నెల గ్యాప్ తో రిలీజ్ అయ్యాయి. ముందుగా 2.0 సినిమా రిలీజ్ సమయం లో సినిమాలో యాక్షన్ సీన్స్ కి క్లైమాక్స్ ఎపిసోడ్ ని మెచ్చుకొని వారు ఉండరు అని చెప్పొచ్చు. అబ్బుర పరిచే విజువల్స్ తో క్లైమాక్స్ ఎపిసోడ్ 15 నిమిషాలు…

గూస్ బంప్స్ తెప్పించాయి… కాగా నెల లోపే వచ్చిన KGF సినిమా ప్రతీ 15 నిమిషాలకు ఎలివేట్ సీన్స్ తో అల్టిమేట్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో గూస్ బంప్స్ ని మొదటి నుండి చివరి వరకు కంటిన్యు చేస్తూ మాస్ హిస్టీరియా అంటే ఎంటో చూపెట్టి అన్ని భాషల్లో దుమ్ము లేపేసింది.

దాంతో రీసెంట్ గా ప్రకటించిన నేషనల్ అవార్డు వేడుకల్లో బెస్ట్ యాక్షన్ క్యాటగిరీ లో రోబో 2.0 కి వస్తుంది అనుకున్న బెస్ట్ యాక్షన్ అవార్డ్ ను KGF సినిమా సొంతం చేసుకుంది, కాగా రోబో 2.0 కి ఒక్క అవార్డ్ కూడా ఈ ఈవెంట్ లో దక్కక పోవడం విచారకరం.

దాంతో 500 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి 3D లో సినిమా తీసినా కానీ 80 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందించిన KGF అటు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి ఇటు అవార్డ్ కూడా సొంతం చేసుకుని డబుల్ షాక్ ఇచ్చింది అని చెప్పొచ్చు. ఇక పార్ట్ 2 లో ఏ రేంజ్ లో యాక్షన్ సీన్స్ ని పెడతారో చూడాలి… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here