Home న్యూస్ ఇదేం క్రేజ్ రా బాబు…..అక్కడ బాహుబలి2 ఔట్ అంటున్నారే!!

ఇదేం క్రేజ్ రా బాబు…..అక్కడ బాహుబలి2 ఔట్ అంటున్నారే!!

0

ఆర్ ఆర్ ఆర్ బాక్స్ ఆఫీస్ సందడి కొనసాగుతుండగా మరో పాన్ ఇండియా మూవీ ఇప్పుడు ఆల్ ఇండియా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధం అవుతుంది, ఆ సినిమా కే యష్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న సెన్సేషనల్ సీక్వెల్ KGF చాప్టర్ 2…. 14 న అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా పై అంచనాలు అయితే మరో లెవల్ లో ఉండగా…

ఆ అంచనాలను ఏమాత్రం తీసి పోని రేంజ్ లో సినిమా ట్రైలర్ కూడా కుమ్మేయడం, మాస్ ఎలివేషన్స్ తో దుమ్ము లేపడంతో ఎక్స్ పెర్టేషన్స్ ఇంకా పెరిగి పోయాయి. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆల్ ఇండియా సినీ లవర్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు…

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 14న రిలీజ్ కానుండగా అడ్వాన్స్ బుకింగ్స్ జోరు ఆల్ రెడీ మొదలు అవ్వగా హిందీ బెల్ట్ లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పుడు ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురి అయ్యేలా చేస్తుంది అని చెప్పాలి. ఆ రేంజ్ లో సినిమా బుకింగ్స్ తో…

దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతుంది అక్కడ…. ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని సొంతం చేసుకున్న సినిమా ఆర్ ఆర్ ఆర్ కన్నా కూడా డబుల్ స్పీడ్ తో దుమ్ము లేపుతూ ఉండగా సినిమా ప్రీ బుకింగ్స్ ఆల్ మోస్ట్ బాహుబలి2 రేంజ్ లో ఉందని సమాచారం. దాంతో ఇప్పుడు సినిమా ఊపు చూస్తుంటే….

Baahubali2 Telugu Version Total Collections!!

ఫస్ట్ డే హిందీ లో బాహుబలి2 ఓపెనింగ్స్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని అంచనా వేస్తున్నారు. బాహుబలి2 ఓపెనింగ్ డే రోజున 41 కోట్ల లోపు నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ప్రస్తుతం KGF చాప్టర్ 2 కొంచం స్క్రీన్స్ తక్కువే దొరికే అవకాశం ఉన్నా టికెట్ హైక్స్ ఎక్కువ ఉండటంతో బాహుబలి2 ఓపెనింగ్స్ ని బ్రేక్ చేసే ఛాన్స్ ఎంతైనా ఉందని అంచనా వేస్తున్నారు. మరి ఇది నిజం అవుతుందా లేదా కొన్ని రోజుల్లో తేలనుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here