మమ్మోత్ KGF సినిమా పార్ట్ 2 అంచనాలను మించి ఊచకోత కోయడానికి సిద్ధం అవుతుంది, సినిమా పై ఉన్న క్రేజ్ దృశ్యా సినిమా కి అన్ని చోట్లా అద్బుతమైన బిజినెస్ ఆఫర్లు వస్తూ ఉన్నాయి. సినిమా అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి అల్టిమేట్ రికార్డులతో ఊచకోత కోయడంతో ఆ క్రేజ్ మరింతగా పెరిగి పోయింది. దాంతో అన్ని చోట్లా సినిమా కి బిజినెస్ పరంగా అల్టిమేట్ ఆఫర్స్ వస్తూ ఉండటం విశేషం.
అన్ని చోట్లా క్రేజ్ ఒకెత్తు తెలుగు రాష్ట్రాలలో క్రేజ్ ఒకెత్తు గా చెప్పుకోవాలి, ఆల్ మోస్ట్ టాప్ స్టార్ హీరోల రేంజ్ కి తగ్గని బిజినెస్ ని ఈ సినిమా సొంతం చేసుకోబోతుంది అంటూ టాలీవుడ్ లో ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆల్ టైం బిగ్గెస్ట్ బిజినెస్ ఆఫర్లు..
ఈ సినిమా కి దక్కుతున్నాయి. రీసెంట్ గా కేవలం ఆంధ్రా రీజన్ కి గాను ఈ సినిమా కి అల్టిమేట్ ఆఫర్ దక్కిందని సమాచారం. ఆంధ్రా రీజన్ 6 జిల్లాలు కలిపి ఈ సినిమా ఏకంగా 35 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుందని అంటున్ననారు.
ఇక మెయిన్ సెంటర్లు అయిన నైజాం మరియు సీడెడ్ ఏరియాలు ఉండనే ఉన్నాయి. అవి ఏ రేంజ్ లో జరుగుతాయో అన్నది ఆసక్తిగా మారగా టాలీవుడ్ స్టార్ హీరోల రేంజ్ లో ఈ సినిమా బిజినెస్ ను రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంటుంది, మొదటి పార్ట్ సాధించిన ఊహకందని విజయం అలాగే రెండో పార్ట్ పై నెలకొన్న అంచనాల దృశ్యా… సినిమా కి ఎంత బిజినెస్ అయినా…
పెట్టడానికి బయ్యర్లు ముందుకు వస్తున్నారు. దాంతో డబ్బింగ్ మూవీస్ పరంగా కూడా బిగ్గెస్ట్ బిజినెస్ ను ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంటూ ఊచకోత కోయనుంది. ఇక సినిమా ఓవరాల్ గా బిజినెస్ అన్ని చోట్లా కలిపి ఊహకందని రేంజ్ లో ఉండే అవకాశం కూడా ఎంతైనా ఉందని చెప్పాలి.