2021 లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ముందు నిలిచే సినిమా KGF చాప్టర్ 2, మొదటి పార్ట్ సాధించిన సంచలన విజయం వలన ఈ సినిమా పై అంచనాలు అయితే ఆల్ టైం హై లో ఉన్నాయి, దానికి తోడూ సినిమా అఫీషియల్ టీసర్ కి వచ్చిన రెస్పాన్స్ వరల్డ్ రికార్డ్ నే క్రియేట్ చేయగా ఇప్పుడు ఆ ఇంపాక్ట్ సినిమా బిజినెస్ పై క్లియర్ గా కనిపిస్తుంది, ఎక్స్ పెర్టేషన్స్ మరింత పెరిగి పోవడం తో….
సినిమా బిజినెస్ మరో రేంజ్ లో జరుగుతూ వస్తుంది. సినిమా ఇటు తెలుగు రాష్ట్రాలలో సెన్సేషనల్ బిజినెస్ ఆఫర్స్ వస్తూ ఉండగా హిందీ లో సినిమా పై మరో లెవల్ లో క్రేజ్ నడుస్తుంది ఇప్పుడు. కాగా అక్కడ బిజినెస్ ఆఫర్స్ ఆల్ టైం రికార్డ్ లెవల్ లో వస్తూ ఉండగా…
అందులో ఇప్పుడు ఫైనల్ బిజినెస్ ఆఫర్ కింద 90 కోట్ల మమ్మోత్ రేటు సినిమా కి దక్కింది అంటున్నారు. 90 కోట్లు అది కూడా ఒక డబ్బింగ్ మూవీ కి అంటే ఇది ఏ రేంజ్ రచ్చో అర్ధం చేసుకోవచ్చు. ఇది వరకు బాహుబలి 2 సినిమా కి హిందీ లో 70 కోట్ల రేంజ్ లో…
బిజినెస్ జరిగింది, తర్వాత 2.0 సినిమా కి కూడా హ్యుమంగస్ బిజినెస్ జరిగింది కానీ అందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించారు, ఇప్పుడు KGF చాప్టర్ 2 లో కూడా సంజయ్ దత్, రవీనా టండన్ లాంటి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ బాక్స్ ఆఫీస్ రేంజ్ చాలా తక్కువ. అయినా కానీ ఈ రేంజ్ బిజినెస్ ఆఫర్ ను హిందీ లో సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు హిందీ లో హిట్ అవ్వాలి అంటే…
మినిమమ్ 170 కోట్ల నుండి 180 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది, మొదటి పార్ట్ 45 కోట్లు కలెక్ట్ చేసింది, ఇప్పుడు రెండో పార్ట్ కొండంత లక్ష్యంతో బరిలోకి దిగుతుంది, మరి సినిమా ఈ కొండంత లక్ష్యాన్ని సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో ఊచకోత కొస్తుందో చూడాలి ఇక. సినిమా జులై 13 న భారీ లెవల్ లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.