Home గాసిప్స్ KGF తో నేషనల్ వైడ్ క్రేజ్…కొత్త సినిమా కమిట్ అయిన యష్!

KGF తో నేషనల్ వైడ్ క్రేజ్…కొత్త సినిమా కమిట్ అయిన యష్!

422
0

ఒక్క సినిమా తో నేషనల్ వైడ్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు కన్నడ స్టార్ హీరో యష్. 2018 లో వచ్చిన KGF అనే సినిమా అంచనాలను మించి అన్ని చోట్ల కూడా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. బాక్స్ ఆఫీస్ దగ్గర 200 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకున్న మొట్ట మొదటి కన్నడ మూవీ గా నిలిచింది ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ ఇయర్ అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటున్న ఈ సీక్వెల్ తో యష్ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉంది, సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా కే.జి.ఎఫ్ పార్ట్ 2 కోసం చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు అందరూ.

ఇక ఈ సినిమా తర్వాత యష్ ఏ టాప్ డైరెక్టర్ తోనో సినిమా ఉంటుందని, అది బాలీవుడ్ లేదా టాలీవుడ్ డైరెక్టర్ అయ్యి ఉంటుందని చాలా వార్తలే వచ్చాయి కానీ అందరికీ షాక్ ఇస్తూ కన్నడ అప్ కమింగ్ డైరెక్టర్ తోనే యష్ అప్ కమింగ్ సినిమా ఉండబోతుందని లేటెస్ట్ గా శాండల్ వుడ్ లో అనుకుంటున్నారు.

కన్నడ లో 2017 లో వచ్చిన సూపర్ హిట్ మూవీస్ లో మఫ్టీ అనే సినిమా తీసిన నార్తన్ అనే డైరెక్టర్ తో యష్ అప్ కమింగ్ మూవీ ఉంటుందట, నార్తన్ ప్రస్తుతం కోలివుడ్ స్టార్ హీరో ధనుష్ తో సినిమా చేస్తున్నాడు. అది పూర్తీ అయిన వెంటనే యష్ తో సినిమా ఉంటుందని కన్నడలో గట్టిగానే చెప్పుకుంటున్నారు.

కే.జి.ఎఫ్ తో పాన్ ఇండియా లెవల్ క్రేజ్ ని సొంతం చేసుకున్న యష్ అప్ కమింగ్ మూవీ కేవలం కన్నడ వరకే ఉంటుందా లేదా మళ్ళీ పాన్ ఇండియా లెవల్ లో ఉంటుందా అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉండగా కచ్చితంగా పాన్ ఇండియా లెవల్ లోనే ఉండే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. త్వరలోనే దీని పై అప్ డేట్ ఉండే అవకాశం ఉంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here