Home న్యూస్ దారుణం…..25 కోట్ల సినిమా…50 లక్షలు ఏంటి సామి!!

దారుణం…..25 కోట్ల సినిమా…50 లక్షలు ఏంటి సామి!!

615
0

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా లు రిలీజ్ అయ్యి ఉంటే రోజు వారి అన్ని ఏరియాల కలెక్షన్స్ ఎప్పటి కప్పుడు తెలిసి ఉండేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు, కానీ డిజిటల్ రిలీజ్ లో పే పెర్ వ్యూ పద్దతిలో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు రీసెంట్ గా. కానీ వాటి వ్యూస్ అండ్ కలెక్షన్స్ ని అఫీషియల్ గా యాప్ వాళ్ళు రిలీజ్ చేస్తేనో.. లేక నిర్మాతలకు చెబితే వాళ్ళ నుండి కానీ..

ఆడియన్స్ కి రిలీజ్ అవుతూ ఉంటాయి, లేటెస్ట్ గా పే పెర్ వ్యూ పద్దతి లో వచ్చిన సినిమా ఖాళీ పీలి, సుమారు 25 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా మీద డౌట్ తో ఉన్న జీ 5 వాళ్ళు సినిమాను పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేయగా…

రెండు రోజుల్లో 80 వేలకి పైగా వ్యూస్ వచ్చాయని ట్రేడ్ లో ఒక వర్గం రిలీజ్ చేయగా వాటి కలెక్షన్స్ 299 టికెట్ రేటు ప్రకారం 2.4 కోట్ల రేంజ్ లో వచ్చి ఉండొచ్చని అంచనా వేశారు, కాగా ఇప్పుడు మరో వర్గం అసలు సినిమా అంత కలెక్ట్ చేయలేదని…..

ఇప్పటి వరకు సినిమా కేవలం 17.5 వేల లోపు టికెట్ లు మాత్రమె సేల్ అయ్యాయని గట్టిగా చెబుతున్నారు.. దాంతో 17.5 వేల మార్క్ ని కూడా సినిమా అందుకోలేదా అని అందరూ నివ్వెరపోయారు అనే చెప్పాలి, బాలీవుడ్ సినిమాలకు టాక్ ఎలా ఉన్నా చూస్తారు కానీ ఈ రేంజ్ లో రిజక్ట్ చూసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు.

17.5 వేల లోపే సినిమా కి యూనిక్ వ్యూస్ వచ్చి ఉంటే సినిమా కి టికెట్ 299 చొప్పున 50 లక్షల లోపు గ్రాస్ కలెక్షన్స్ మాత్రమె వచ్చి ఉంటాయి అని చెప్పొచ్చు. 25 కోట్ల బడ్జెట్ కి ఇవి డిసాస్టర్ కి మించి కలెక్షన్స్ అనే చెప్పాలి. ఇక జీ 5 వాళ్ళు ఇప్పుడు ఏవి నిజం అని కలెక్షన్స్ ని రిలీజ్ చేస్తారు అన్నది ఆసక్తి గా మారింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here