బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రీ రిలీజ్ అయిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఖలేజా(Khaleja4K Re Release) సినిమా ఊహకందని రికార్డులతో ఊచకోత కోస్తుంది…నార్మల్ గా హీరోల బర్త్ డే టైంలో ఇలాంటి రచ్చ ఉంటుంది కానీ ఖలేజా సినిమా సమ్మర్ టైంలో…
దుమ్ము లేపుతూ మాస్ రచ్చ చేయబోతుంది…కాగా టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ మొదలు అయిన తర్వాత లాస్ట్ ఇయర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పుట్టిన రోజు టైంలో పవన్ కెరీర్ లో బిగ్ మాస్ హిట్స్ లో ఒకటైన గబ్బర్ సింగ్(Gabbar Singh) మూవీ ని రీ రిలీజ్ చేయగా…
రిమార్కబుల్ కలెక్షన్స్ ని ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని వీర లెవల్ లో కుమ్మేసింది…మొదటి రోజు కి ముందు వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో బుక్ మై షో లో ఆల్ మోస్ట్ 175K టికెట్ సేల్స్ ను దక్కించుకుని ఆ సినిమా రికార్డ్ కొట్టింది. తర్వాత వచ్చిన ఏ సినిమాలు కూడా..
ఈ రేంజ్ లో రచ్చ చేయలేదు కానీ ఇప్పుడు మహేష్ ఖలేజా సినిమా రిలీజ్ కి ముందు రోజు కూడా 29 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోయగా ఓవరాల్ గా 192K టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని గబ్బర్ సింగ్ టికెట్ సేల్స్ రికార్డ్ ను బ్రేక్ చేసి…
సంచలన రికార్డ్ ను నమోదు చేసింది…ఇక అడ్వాన్స్ బుకింగ్స్ తో ఆల్ రెడీ అన్ని చోట్ల సంచలనాలు సృష్టిస్తున్న ఈ సినిమా టాలీవుడ్ లో రీ రిలీజ్ లలో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఓవర్సీస్ లో కూడా ఓపెనింగ్స్ కుమ్మేస్తున్నాయి కాబట్టి కొత్త రికార్డ్ ఖాయమనే చెప్పాలి…