Home న్యూస్ భైవరంకి ఖలేజా దెబ్బ….1st డే ఏమవుతుందో ఇక!!

భైవరంకి ఖలేజా దెబ్బ….1st డే ఏమవుతుందో ఇక!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మే నెల ఉన్నంతలో టాలీవుడ్ కి పర్వాలేదు అనిపించేలా సాగింది. మూడు హిట్ మూవీస్ పడ్డాయి…ఇక నెల ఎండ్ లో ఆడియన్స్ ముందుకు ఒక సాలిడ్ రీ రిలీజ్ అలాగే ఒక కొత్త సినిమా రిలీజ్ అయ్యాయి. మహేష్ నటించిన ఖలేజా అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన భైరవం సినిమాలు…

ఈ శుక్రవారం ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే పనిలో ఉండగా కొత్త సినిమాను మహేష్ డిసాస్టర్ ఖలేజా రీ రిలీజ్ లో ఊహకందని రేంజ్ లో డామినేట్ చేస్తుంది. ఆల్ మోస్ట్ ఇప్పటి వరకు 180K టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని రీ రిలీజ్ మూవీస్ లో…

సంచలనం సృష్టించిన ఖలేజా కొత్త సినిమా అయిన భైరవంని ఓ రేంజ్ లో డామినేట్ చేస్తుంది….ఎంత కొత్త సినిమా అయినా కూడా ఈ శుక్రవారం ఆడియన్స్ కి ఖలేజానే మొదటి ఛాయిస్ కానుంది. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా కానీ, షో ల హౌస్ ఫుల్ బోర్డులు కానీ…

అన్ని చోట్ల ఖలేజా క్లియర్ డామినేషన్ కనిపిస్తూ ఉండగా ఇప్పుడు భైరవం సినిమా కచ్చితంగా మౌత్ టాక్ పరంగా ఎక్స్ లెంట్ టాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. టాక్ ఎక్స్ లెంట్ గా ఉంటేనే కామన్ ఆడియన్స్ థియేటర్స్ కి తరలివచ్చే అవకాశం ఉంటుంది.

ఓవరాల్ గా ఖలేజా ప్రస్తుతానికి డే 1 కలెక్షన్స్ పరంగా కొత్త సినిమా భైరవంని డామినేట్ చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఇక భైరవం సినిమా ఎంతవరకు ఈ డిసాస్టర్ రీ రిలీజ్ మాస్ యుఫోరియాని తట్టుకుని ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే ప్రయత్నం చేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here