టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ ను మొదలు పెట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఎప్పటికప్పుడు రీ రిలీజ్ లలో సెన్సేషనల్ రాంపెజ్ ను కూడా చూపెడుతూ ఉండగా..లాస్ట్ ఇయర్ మహేష్ బర్త్ డే టైంలో మురారితో రికార్డులు క్రియేట్ చేయగా ఈ ఇయర్ అన్ సీజన్ లో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టుతో కుమ్మేశాడు…
ఇక ఇప్పుడు ఈ నెల ఎండ్ లో ఆడియన్స్ ముందుకు మహేష్ కెరీర్ లో వన్ ఆఫ్ స్పెషల్ మూవీగా నిలిచిపోయే ఖలేజా(Khaleja4K Re Release) సినిమాను గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తూ ఉండగా…సినిమా మీద ఆల్ రెడీ హైప్ సాలిడ్ గా ఉండగా…
ఆ హైప్ ఏ రేంజ్ లో ఉంది అన్నది రీసెంట్ గా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత అందరికీ క్లియర్ అయింది… కొత్త సినిమాలకు ట్రెండ్ అయినట్లు బుక్ మై షోలో గంటకి 10 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న మొట్ట మొదటి టాలీవుడ్ రీ రిలీజ్ గా…
ఖలేజా సినిమా ఇండస్ట్రీ రికార్డును తిరగరాసింది. ఇది వరకు గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ టైంకి గంటకు 5.5 వేల రేంజ్ లో పీక్ బుకింగ్స్ ను సొంతం చేసుకుని రికార్డ్ కొట్టగా ఇప్పుడు ఖలేజా సినిమా రీ రిలీజ్ లో గంటకి 13.17 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ తో ఆల్ మోస్ట్…
ట్రిపుల్ మార్జిన్ కి దగ్గర అయ్యే రేంజ్ లో లీడ్ ను చూపించి రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇక సినిమా ప్రీ బుకింగ్స్ మే 23న సాయంత్రం 5 తర్వాత మొదలు అవ్వగా మొదటి రోజుకి గాను ఆల్ మోస్ట్ 60 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని రీ రిలీజ్ లలో….
మరో బిగ్ రికార్డ్ ను నమోదు చేసింది. ఆల్ మొదటి రోజుకి గాను అడ్వాన్స్ టికెట్ సేల్స్ గ్రాస్ లెక్క 1.5 కోట్ల మార్క్ ని ఆల్ రెడీ దాటేయడం అలాగే సినిమా క్రేజ్ చూస్తూ ఉంటే అవలీలగా టాలీవుడ్ ఫస్ట్ డబుల్ డిజిట్ గ్రాస్ రీ రిలీజ్ గా ఖలేజా నిలవడం ఇక ఖాయంగా కనిపిస్తుంది.