Home న్యూస్ USA లో ఖలేజా వీరంగం…ఆల్ టైం రికార్డ్ తో భీభత్సం!!

USA లో ఖలేజా వీరంగం…ఆల్ టైం రికార్డ్ తో భీభత్సం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఖలేజా(Khaleja4K Re Release) సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రీ రిలీజ్ ను సొంతం చేసుకుని అనుకున్న అంచనాలను మించి కలెక్షన్స్ పరంగా అన్ని చోట్లా మాస్ వీరంగం సృష్టిస్తూ సంచలన ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని రచ్చ చేస్తుంది.

సినిమా నార్మల్ ఫ్రై డే రిలీజ్ ను సొంతం చేసుకున్నా కూడా ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో కొత్త సినిమాలను సైతం డామినేట్ చేసే రేంజ్ లో జోరు చూపించడం విశేషం… నార్త్ అమెరికాలో సినిమా ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కొత్త రికార్డ్ ను సృష్టించింది.

నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు ఆల్ మోస్ట్ 92.6 వేల డాలర్స్ మార్క్ ని దాటేసి ఖలేజా సినిమా సంచలన రికార్డ్ ను సృష్టించింది. నార్త్ అమెరికాలో టాలీవుడ్ రీ రిలీజ్ లలో ఇది వరకు గబ్బర్ సింగ్ మరియు ఇంద్ర సినిమాలు ఆల్ మోస్ట్ 66 వేల రేంజ్ కి అటూ ఇటూగా…

డాలర్స్ ను అందుకుని సంచలనం సృష్టించగా ఈ రికార్డ్ ను చాలా ఈజీగా బ్రేక్ చేసిన ఖలేజా సినిమా అమెరికాలో మహేష్ స్టార్ పవర్ ను రుజువు చేసి ఇప్పుడు అక్కడ ఫస్ట్ లక్ష డాలర్స్ మార్క్ ని అందుకోబోతున్న టాలీవుడ్ రీ రిలీజ్ గా నిలవడానికి సిద్ధం అవుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో వీర లెవల్ మాస్ కుమ్ముడు కుమ్మేసిన ఖలేజా సినిమా వరల్డ్ వైడ్ గా టాలీవుడ్ తరుపున వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనర్ గా రీ రిలీజ్ మూవీస్ లో నిలవబోతుంది. ఇక వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఎక్స్ లెంట్ గా ఉండటం విశేషం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here