టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఖలేజా(Khaleja4K Re Release) సినిమా రీ రిలీజ్ లో అల్టిమేట్ ట్రెండ్ ను చూపెడుతూ టాలీవుడ్ తరుపున రీ రిలీజ్ లో ఫస్ట్ డబుల్ డిజిట్ గ్రాస్ మార్క్ ని అందుకోబోతున్న సినిమా గా నిలవడానికి సిద్ధం అవుతుంది. ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ సినిమా…
కొత్త రికార్డ్ ను జస్ట్ లో మిస్ చేసుకున్నా కూడా ఓవరాల్ గా ఆల్ టైం టాప్ 2 బిగ్గెస్ట్ రీ రిలీజ్ ఓపెనర్ గా నిలిచి సంచలనం సృష్టించింది. ఇక రెండో రోజులో అడుగు పెట్టిన సినిమా వీకెండ్ లో కొత్త సినిమాలకు ధీటుగాగా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి..
ఓవరాల్ గా టాలీవుడ్ లో రీ రిలీజ్ మూవీస్ లో రెండో రోజున ఖుషి సినిమా ఇది వరకు రికార్డ్ కలెక్షన్స్ ని అందుకుంటే ఆ రికార్డ్ ను లాస్ట్ ఇయర్ మహేష్ మురారి సినిమా బ్రేక్ చేసింది. ఇప్పుడు ఖలేజా సినిమా మురారి రికార్డ్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి….
రెండో రోజు నైజాంలోనే ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా ఒక్క హైదరాబాదు లోనే ఆల్ మోస్ట్ 75 లక్షలకు పైగా గ్రాస్ బుకింగ్స్ మార్క్ ని ఆల్ రెడీ దాటేసి రచ్చ చేయగా ఆంధ్ర సీడెడ్ లలో పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ఉండటంతో… మొత్తం మీద రెండో రోజున సినిమా…
తెలుగు రాష్ట్రాల్లో 1.5-1.7 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్ని చోట్ల బుకింగ్స్ మురారి కన్నా బెటర్ గా ఉండటంతో… రెండో రోజు సినిమా ఈ అంచనాలను మించే అవకాశం…
ఉందని చెప్పాలి. ఇక ఓవర్సీస్ లో ఆల్ రెడీ టాలీవుడ్ రికార్డ్ ను బ్రేక్ చేసి కొత్త రికార్డును నమోదు చేసిన ఈ సినిమా ఇప్పుడు అక్కడ కూడా లాంగ్ రన్ లో కొత్త బెంచ్ మార్క్ ను నమోదు చేస్తూ అప్ కమింగ్ మూవీస్ కి సాలిడ్ టార్గెట్ ను సెట్ చేయబోతుంది. ఇక టోటల్ గా 2 రోజుల సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.