టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఖలేజా(Khaleja4K Re Release) సినిమా ఊహకందని వసూళ్ళతో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపుతూ నార్మల్ వీకెండ్ లో కొత్త సినిమాలను డామినేట్ చేస్తూ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ మాస్ ఊచకోత కోస్తూ ఉండగా…
సినిమా రెండు రోజుల టైంకే టాలీవుడ్ రీ రిలీజ్ ల రికార్డ్ ను సమం చేసి సంచలనం సృష్టించింది. ఇక మూడో రోజు కలెక్షన్స్ తో ఇప్పుడు టాలీవుడ్ లో సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ ను రీ రిలీజ్ మూవీస్ లో సొంతం చేసుకుని సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి.
లాస్ట్ ఇయర్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే టైంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన మురారి సినిమా లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసి టోటల్ రన్ లో 8.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ తో రీ రిలీజ్ లలో టాలీవుడ్ రికార్డ్ ను నమోదు చేసింది.
ఇప్పుడు ఈ కలెక్షన్స్ ని రెండు రోజుల్లోనే అందుకున్న ఖలేజా సినిమా మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ ని అందుకుని ఆల్ మోస్ట్ డబుల్ డిజిట్ గ్రాస్ మార్క్ ని అందుకుని టాలీవుడ్ తరుపున మొట్ట మొదటి డబుల్ డిజిట్ గ్రాస్ మార్క్ ని…
అందుకున్న రీ రిలీజ్ మూవీ గా ఎపిక్ రికార్డ్ ను సృష్టించింది. 2010 లో వచ్చిన డిసాస్టర్ మూవీ ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఇలాంటి రికార్డులను అందుకోవడం మామూలు విషయం కాదు. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో జోరు కొనసాగిస్తుందో చూడాలి ఇప్పుడు.