బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ మూవీస్ కి కూడా బిజినెస్ లు జరుగుతున్నాయి….రీసెంట్ గా ఎండ్ అయిపొయింది అనుకున్న రీ రిలీజ్ ల ట్రెండ్ ఈ ఇయర్ మళ్ళీ మంచి జోరుని చూపెడుతూ కొన్ని సినిమాలు ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ ను చూపించగా రీసెంట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఖలేజా(Khaleja4K Re Release) సినిమా…
గ్రాండ్ గా రీ రిలీజ్ ను సొంతం చేసుకోగా అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ వసూళ్ళనే సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది….కాగా ఇప్పటి వరకు 10.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న ఈ సినిమా టాలీవుడ్ రీ రిలీజ్ మూవీస్ లో…
ఆల్ టైం ఎపిక్ రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. కాగా సినిమా నైజాం ఏరియా బిజినెస్ వాల్యూ 75 లక్షల రేంజ్ లో ఉండగా సినిమా ఏకంగా 2.6 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇక్కడ సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా…
రైట్స్ వాల్యూ 2 కోట్ల దాకా ఉండగా ఆల్ మోస్ట్ 5.25 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని దాటిందని చెప్పొచ్చు…పెట్టిన రేటు మీద సినిమా కొన్న వాళ్ళకి ఊహకందని రేంజ్ లో డబుల్ ప్రాఫిట్స్ ను సొంతం అయ్యేలా చేసిందని చెప్పాలి…
ఓవరాల్ గా 2 కోట్ల బిజినెస్ మీద 3.25 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా రీ రిలీజ్ లో నిలిచింది. 2010 లో డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు రీ రిలీజ్ లో డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలవడం విశేషం అని చెప్పాలి.