మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉండగా క్రాక్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన రవితేజ ఈ సినిమా తో ఎలా ఆకట్టుకుంటాడు ఎంతవరకు క్రాక్ మ్యాజిక్ ని కంటిన్యూ చేస్తాడు అన్నది ఆసక్తిగా మారగా ఈ రోజు రిలీజ్ అయిన ఖిలాడి ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ కి వస్తే….
ఇటలీ నుండి ఇండియాకి 10 వేల కోట్ల డబ్బు ఉన్న కంటైనర్ వస్తుంది… ఆ కంటైనర్ లో ఉన్న డబ్బు హీరో దగ్గర ఉంటుంది, ఆ డబ్బు వెనక ఉన్న స్టొరీ ఏంటి… హీరో జైలుకి ఎందుకు వెళ్ళాడు, హీరో తనకున్న ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకున్నాడు అన్నది మొత్తం మీద మిగిలిన కథ….
పెర్ఫార్మెన్స్ పరంగా రవితేజ మరోసారి తన ఎనర్జీతో ఆకట్టుకోగా యాక్షన్ సీన్స్ లో కూడా దుమ్ము లేపాడు, హీరోయిజం సీన్స్ పర్వాలేదు అనిపించగా ఓవరాల్ గా రవితేజ సినిమా కోసం ఎంత కష్టపడాలో అంతా పడ్డాడు. హీరోయిన్స్ ఇద్దరూ ఆకట్టుకోగా అర్జున్ పాత్ర కూడా బాగుంది. మిగిలిన స్టార్ కాస్ట్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా…
ఎవరికీ కూడా పెద్దగా ఇమ్పార్టంట్స్ లేదనే చెప్పాలి. ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం బాగా మెప్పించినా సాంగ్స్ ప్లేస్ మెంట్ బ్యాడ్ అని చెప్పాలి. కానీ దేవి ఇటు సాంగ్స్ పరంగా అటు బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా కుమ్మేశాడు… ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా నాసిరకంగా అండ్ కన్ఫ్యూజింగ్ గా ఉందని చెప్పాలి. ఫస్టాఫ్ ఎలాగోలా పర్వాలేదు అనిపించినా…
సెకెండ్ ఆఫ్ కథ ఎటు నుండి ఏటో వెళుతుంది, ఇక్కడ డైరెక్షన్ బిగ్ మైనస్ పాయింట్ అయింది… ప్రొడక్షన్ వాల్యూస్ కొన్ని సీన్స్ కి అదిరిపోయింది కొన్ని సీన్స్ జస్ట్ ఓకే. అలాగే సినిమాటోగ్రఫీ కూడా కొన్ని సీన్స్ ఎక్స్ లెంట్ వచ్చాయి కొన్ని బారాలేదు… ఇక డైరక్షన్ విషయానికి వస్తే రమేష్ వర్మ ఎంచుకున్న కథ పాయింట్ చాలా బాగుంది కానీ……
దాన్ని తను అనుకున్న విధంగా అయితే తీయలేక పోయాడు. ముఖ్యంగా సెకెండ్ ఆఫ్ కథ కంప్లీట్ గా ట్రాక్ తప్పి ఎటు నుండి ఏటో పోవడం తో రవితేజ కష్టపడుతున్నా కథ సెట్ అవ్వక పోవడంతో ఆ కష్టం వృదా అయింది అనిపించింది, అయినా కానీ మాస్ ఆడియన్స్ కి నచ్చే సాంగ్స్, ఫైట్స్ కొన్ని హీరోయిజం సీన్స్ అక్కడక్కడా పార్టు పార్టులుగా బాగుండటంతో….
ఓపిక పట్టి చూస్తె ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ చాలా బాగా మెప్పించగా అప్పటి వరకు కామెడీ అంతగా మెప్పించక పోయినా ఇంటర్వెల్ తో ఒక్క సారిగా హై ఫీల్ వచ్చి సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరుగాయి కానీ డైరెక్టర్ సెకెండ్ ఆఫ్ ని ట్రాక్ తప్పించడంతో నిరాశ కలుగుతుంది… మొత్తం మీద సినిమాలో…
హైలెట్స్ విషయానికి వస్తే రవితేజ పెర్ఫార్మెన్స్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం బ్యాగ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్ అని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే డైరెక్షన్, సెకెండ్ ఆఫ్ ట్రాక్ తప్పడం, స్క్రీన్ ప్లే బాలేకపోవడం మరియు చాలా క్యారెక్టర్స్ ని వృదా చేసుకోవడం అని చెప్పాలి. అయినా కానీ ఓపిక చేసుకుని కష్టపడి చూస్తె పర్వాలేదు అనిపిస్తుంది… మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్….