బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ లో మంచి అంచనాల నడుమ రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు అన్నీ కూడా ఏవో ఒక కారణాల వలన పోస్ట్ పోన్ అవుతూనే ఉండగా లాస్ట్ ఇయర్ సమ్మర్ తో పోల్చితే ఈ ఇయర్ సమ్మర్ మరింత చప్పగా సాగుతూ ఉండగా సమ్మర్ బిగ్ మూవీస్ లో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu Movie)…
అలాగే యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) కొత్త సినిమా కింగ్ డం(Kingdom Movie) లు మంచి క్రేజ్ ను సొంతం చేసుకోగా ఈ పాటికే ఈ సినిమాలు రిలీజ్ అవ్వాల్సింది కానీ ఒక సినిమా రిలీజ్ డేట్ న మరో సినిమాను..
రిలీజ్ ను అనౌన్స్ చేయడం, మరో సినిమా పోస్ట్ పోన్ అవ్వడం, మళ్ళీ పాత సినిమా పోస్ట్ పోన్ అవ్వడం, ఇలానే కంటిన్యూగా సాగుతూ ఉండగా…ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా ఎట్టి పరిస్థితులలో కూడా జులై నెలలో రిలీజ్ అవ్వాల్సిన అవసరం నెలకొంది…
సమ్మర్ నుండి పోస్ట్ పోన్ అవుతున్న ఈ సినిమాలను కొన్న డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వరుస డిలే లను భరిస్తూ రాగా ఇక ఆగమని, సినిమాలు జులై లో రిలీజ్ కాకపోతే మాత్రం రేటు ను భారీగా తగ్గిస్తాం అంటూ అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం…
హరి హర వీర మల్లుని అమెజాన్ ప్రైమ్ కొనగా కింగ్ డం సినిమాను నెట్ ఫ్లిక్స్ వాళ్ళు కొనగా రెండు సినిమాలకు జులై లో రిలీజ్ చేయాల్సిందే అంటూ అల్టిమేటం ఇచ్చారట. దాంతో రెండు సినిమాల అన్ని పనులు కంప్లీట్ అయితే… జులై 18, జులై 25న వరుసగా…
ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు, ఒకవేళ ఏదైనా సినిమా మిస్ అయితే ఆగస్ట్ 1న ఫైనల్ డేట్ గా పెట్టుకోవచ్చు అని అంటున్నారు… మరి ఫైనల్ గా చాలా సార్లు డిలే అవుతూ వస్తున్న ఈ సినిమాలు ఇక జులైలో వస్తాయో రావో చూడాలి ఇక…