యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) కి బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో ఈ మధ్య హిట్స్ లేవు, అయినా కూడా యూత్ లో కానీ ట్రేడ్ లో కానీ తన సినిమాలకు సాలిడ్ మార్కెట్ ఉందనే చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ స్టార్ మూవీ తో అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోయిన విజయ్ దేవరకొండ…
ఆ సినిమా తర్వాత ఆల్ మోస్ట్ ఏడాదికి పైగా టైం తీసుకుని చేస్తున్న తన కొత్త సినిమా కింగ్ డం(Kingdom Movie) ఈ పాటికే రిలీజ్ అవ్వాల్సింది కానీ అనుకోకుండా పోస్ట్ పోన్ అవుతూ ఇప్పుడు ఆగస్ట్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా…
సినిమా టీసర్ రిలీజ్ తర్వాత సినిమా మీద హైప్ భారీగానే పెరిగిపోయింది. ఏ మాత్రం టాక్ బాగున్నా కూడా టాలీవుడ్ టైర్2 హీరోల సినిమాల పరంగా సాలిడ్ రికార్డులను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉండగా మరో పక్క సినిమా బిజినెస్ లు కూడా..
అన్ని మేజర్ ఏరియాల్లో ఎక్స్ లెంట్ రేట్స్ కి అమ్ముడు పోతున్నాయని తెలుస్తుంది. లేటెస్ట్ గా సినిమా కర్ణాటక బిజినెస్ కంప్లీట్ అవ్వగా అక్కడ సాలిడ్ రేటు నే ఈ సినిమా సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ ప్రీవియస్ మూవీ ఫ్యామిలీ స్టార్ అక్కడ ఓవరాల్ గా…
2.6 కోట్ల రేంజ్ లో రేటు ని సొంతం చేసుకుంటే ఇప్పుడు చేస్తున్న కింగ్ డం మూవీ కి 4 కోట్ల రేంజ్ లో రేటు సొంతం అయినట్లు సమాచారం. ఓవరాల్ గా ఫ్లాఫ్స్ లో ఉన్నా కూడా ఇది మాసివ్ రేటు అనే చెప్పాలి. అండ్ రిలీజ్ టైం లో పోటి ఉండే అవకాశం ఉన్నా ఈ రేంజ్ రేటు సొంతం చేసుకున్న ఈ సినిమా తో ఇప్పుడు విజయ్ దేవరకొండ ఏ రేంజ్ లో కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.