Home న్యూస్ కింగ్ స్టన్ మూవీ రివ్యూ….హిట్టా-ఫట్టా!!

కింగ్ స్టన్ మూవీ రివ్యూ….హిట్టా-ఫట్టా!!

0

ఒక పక్క సంగీత దర్శకుడిగా ఫుల్ బిజీగా ఉంటూనే యాక్టర్ గా కూడా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న జి.వి.ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) కెరీర్ లో హీరోగా నటించిన 25వ సినిమా అయిన కింగ్ స్టన్(Kingston Movie) ఇండియన్ మూవీస్ లో ఇప్పటి వరకు రాని కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా ఎలా ఉంది ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే….తమిళనాడు సముద్రతీరంలో ఒక గ్రామంలో అనుకోకుండా కొందరు చనిపోతూ ఉంటారు…ఈ క్రమంలో దానికి ఒకరు కారణం ఒకరు అనుకుని తనని కొట్టి చంపేస్తారు…అతని ఆత్మ ఊరిని పట్టి పీదిస్తుందని బయపడి సముద్రంలో సమాది చెస్తారు…ఆ తర్వాత కథ మారిపోతుంది….ఈ క్రమంలో…

డబ్బు సంపాదించి ఒక బోటు కొనాలని చూసే హీరో ఒక టీం తో సముద్రంలో అడుగు పెడతాడు…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా ఓవరాల్ గా స్టోరీ పాయింట్….సముద్రంలో జాంబీలు అనేది డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన కింగ్ స్టన్ మూవీ డిఫెరెంట్ లేయర్స్ మరీ ఎక్కువ అవ్వడం వలన…

అన్ని మిక్స్ చేసిన కిచిడీ అయ్యింది….సముద్రంలో జాంబీల కాన్సెప్ట్ బాగున్నా ఆ సీన్స్ కోసం ఆడియన్స్ ఎంతో ఆశగా ఎదురు చూసేలా చేశాడు డైరెక్టర్….సెకెండ్ ఆఫ్ లో ఆ సీన్స్ వచ్చినా అప్పటికే చాలా ఆలస్యం అయిన ఫీలింగ్ కలుగుతుంది…. జివి ప్రకాష్ కుమార్ ఉన్నంతలో బాగానే నటించి మెప్పించగా…

హీరోయిన్ దివ్యభారతి పర్వాలేదు అనిపించగా, స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ చాలా కన్ఫ్యూజింగ్ గా అనిపించగా ఫస్టాఫ్ ఎలాగోలా పర్వాలేదు అనిపించినా సెకెండ్ ఆఫ్ మాత్రం ఎటు నుండి ఎటో పోయింది అని చెప్పాలి…దాంతో కాన్సెప్ట్ కి మంచి స్కోప్ ఉన్నా కూడా అది డైరెక్టర్ సరిగ్గా డీల్ చేయలేక పోయాడు….

సెకెండ్ ఆఫ్ ని ఇంకా బెటర్ గా తీసి….నిధి….జాంబీల ను ఇంకా బాగా వాడుకుని ఉంటే సినిమా బాగుండేది… ఓవరాల్ గా సినిమా మరీ తీసిపారేసే సినిమా కాక పోయినా కూడా ఓవరాల్ గా కొంచం ఓపిక చేసుకుని చూస్తె కాన్సెప్ట్ అండ్ కొన్ని సీన్స్ కోసం ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంటుంది సినిమా…

ట్రైలర్ చూసి సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది అని అంచనాలు పెట్టుకుని థియేటర్స్ కి వెళితే మాత్రం కొన్ని సీన్స్ వరకు బాగున్నా కూడా ఓవరాల్ గా సినిమా పెద్దగా అంచనాలను అందుకోలేక పోయినా కూడా ఓవరాల్ గా కొంచం ఓపిక చేసుకుని చూస్తె ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు. మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here