Home న్యూస్ నన్ను కావాలని ట్రోల్ చేస్తున్నారు….ఆ సినిమా హిట్ కానీ…ఫ్లాఫ్ చేశారు…కిరణ్ అబ్బవరం!!

నన్ను కావాలని ట్రోల్ చేస్తున్నారు….ఆ సినిమా హిట్ కానీ…ఫ్లాఫ్ చేశారు…కిరణ్ అబ్బవరం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ వినరో భాగ్యము విష్ణు కథ సినిమా మంచి కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ టార్గెట్ వైపు వెళుతూ ఉండగా రీసెంట్ గా సినిమా సక్సెస్ మీట్ లో హీరో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి… తనని కావాలని సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారని కిరణ్ అబ్బవరం చెబుతున్నాడు…ఎవరెవరో ఎక్కడి నుండో….

నన్ను నా సినిమాలను కావాలని ట్రోల్ చేస్తున్నారని కామెంట్స్ చేయగా, తన లాస్ట్ సినిమాలు అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకోక పోవడంతో తాను వాటిపై స్పందించలేదని కానీ ఇప్పుడు బాగున్న వినరో భాగ్యము విష్ణుకథ సినిమా పై కూడా బాలేదని కామెంట్స్ చేయడం భాదిస్తుందని చెప్పాడు….

ఇక్కడ నేపోటిజం లేదని కానీ ఇలా కొందరు ఎదిగే కొత్త హీరోలను తొక్కాలని చూస్తున్నారని చెబుతూ, తన లేటెస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా త్వరగానే క్లీన్ హిట్ అయిందని నిర్మాత చెప్పగా అన్ని వెబ్ సైట్స్ నిర్మాతలు చెప్పే కలెక్షన్స్ నే వేయాలని చెప్పాడు…అలాగే తన లాస్ట్ మూవీ సమ్మతమే 3 కోట్ల బడ్జెట్ తో 12 కోట్లు రాబడితే ఆ సినిమా ఫ్లాఫ్ చేశారని కామెంట్స్ చేశాడు…

సోషల్ మీడియాలో కిరణ్ అబ్బవరం ట్రోల్ అవ్వడానికి ఒక కారణం తన సినిమాల రిలీజ్ టైం లో కొన్ని పెయిడ్ పోస్టులు, ట్వీట్స్ పడటం లాంటివి ఒక కారణం అని చెప్పొచ్చు, అలాగే కలెక్షన్స్ ఒక్క కిరణ్ సినిమాకే కాదు అనేక సినిమాలకు పోస్టర్స్ లెక్కలు ఏరియాల వారి లెక్కలతో పోల్చితే వేరుగా ఉండటంతో వాటిపై కూడా ట్రోల్స్ పడ్డా ఆ హీరోలు ఎవ్వరూ ఇలాంటి కామెంట్స్ అయితే చేయలేదు…. ఇలాంటి సోషల్ మీడియా ట్రోల్స్ ని పట్టించుకోకుండా ఉంటే వాళ్ళే ఆపెస్తారని, కానీ ఇలా కామెంట్స్ చేయడంతో పాజిటివిటీ కన్నా తిరిగి కొత్త సినిమాలపై వ్యతిరేకత ఉండే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here