Home న్యూస్ బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కింధపురి’ గ్లిమ్స్ రివ్యూ….మాస్ కుమ్ముడు ఖాయం!!

బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కింధపురి’ గ్లిమ్స్ రివ్యూ….మాస్ కుమ్ముడు ఖాయం!!

0

బాలీవుడ్ లో తన ఫ్యూచర్ ఊహించుకుని ఛత్రపతి రీమేక్ అక్కడ చేసినా పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో తిరిగి టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sreenivas) త్వరలో భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా…

మరో పక్క మరికొన్ని సినిమాలతో కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు….ఇక లేటెస్ట్ గా తన లేటెస్ట్ మూవీస్ లో ఒకటైన కిష్కింధపురి(Kishkindhapuri movie) హర్రర్ మిస్టిక్ ఫిల్మ్ గా రూపొందుతూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు…

సినిమాలో బెల్లంకొండకి జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తూ ఉండగా వీళ్ళ కాంబోలో ఇది వరకు రాక్షుసుడు లాంటి సూపర్ హిట్ మూవీ రాగా ఇప్పుడు ఈ మిస్టిక్ కాన్సెప్ట్ తో వస్తున్న కిష్కింధపురి ఫస్ట్ గ్లిమ్స్ తోనే ఆకట్టుకుందని చెప్పాలి ఇప్పుడు…

కథ పాయింట్ ని ఏమి చెప్పలేదు కానీ, గ్లిమ్స్ లో కొన్ని తలపులు అసలు ఎప్పటికీ తెరవకూడదు, కొన్ని శబ్దాలు ఎప్పటికీ వినకూడదు అలాగే కొన్ని చోట్లు అసలు ఎప్పటికీ గుర్తు ఉండకూడదు అంటూ డిఫెరెంట్ టైప్ లో గ్లిమ్స్ మెప్పించగా….పెద్దగా గ్లిమ్స్ లో డైలాగ్స్ లేక పోయినా…

చాలా వరకు షాట్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం గ్లిమ్స్ లో హైలెట్ గా నిలిచాయి అని చెప్పాలి. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ ఒక లుక్ టెర్రిఫై చేసేలా ఉండగా ఓవరాల్ గా సినిమా మీద ఉన్న అంచనాలను గ్లిమ్స్ పెంచగా…ఈ రైనీ సీజన్ లో…

సినిమా రిలీజ్ కానుందని అంటున్నారు. ఇక ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ కచ్చితంగా అంచనాలను అందుకునే అవకాశం ఉండగా…భైరవం తర్వాత ఈ సినిమా తో ఎంతవరకు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న అంచనాలను అందుకుంటాడో చూడాలి ఇక….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here