Home గాసిప్స్ కొబ్బరిమట్ట ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!

కొబ్బరిమట్ట ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!

1851
0

     హృదయ కాలేయం సినిమా తో తనకంటూ మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న సంపూర్నేష్ బాబు తర్వాత ఎన్ని సినిమాలు చేసినా అనుకున్న రేంజ్ బజ్ ఏ సినిమాలకు కూడా దొరకలేదు, ఇలాంటి సమయం లో కొబ్బరి మట్ట అంటూ హృదయ కాలేయం టీం తో కలిసి ప్రాజెక్ట్ మొదలు పెట్టగా చాలా కాలంగా ఆగిన సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, ఓవర్సీస్ లో ముందుగా ప్రీమియర్ షోలను పూర్తి చేసుకోగా అక్కడ నుండి ఎలాంటి టాక్ లభించిందో తెలుసుకుందాం పదండీ..

కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయకున్నా పెదరాయుడు, చినరాయుడు కాలం తర్వాత ఆండ్రాయిడు గా మూడు డిఫెరెంట్ రోల్స్ తో సంపూ సినిమా మొత్తం దుమ్ము లేపాడని, స్టొరీ లైన్ రివీల్ చేయడం వలన థ్రిల్ మిస్ అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు.

సినిమాలో కథ పాయింట్ కన్నా కథనం డైలాగ్స్ అండ్ సంపూర్నేష్ పెర్ఫార్మెన్స్ మెయిన్ హైలెట్ అని అంటున్నారు, సినిమా లెంత్ కూడా తక్కువే ఉండటం తో అనవసరపు సీన్స్ కి చాన్స్ లేకుండా డైరెక్టర్ చాలా బాగా స్క్రీన్ ప్లే ని రాసుకున్నాడని అంటున్నారు, సినిమాలో చాలా సీన్స్ లో కామెడీ బాగా పండిందని అంటున్నారు.

లాజిక్ లేని సీన్స్ కొన్ని మైనస్ గా అనిపించినా ఓవరాల్ గా ఇది కామెడీ మూవీ కావడం తో అవేవి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, 1 గంటా 50 నిమిషాల సినిమా లో చాలా సీన్స్ ని ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం ఖాయమని చెబుతున్నారు.

మొత్తం మీద ఓవర్సీస్ ఆడియన్స్ నుండి సినిమా కి ఎబో యావరేజ్ నుండి హిట్ రేంజ్ టాక్ బయటికి వినిపిస్తుందని చెప్పొచ్చు. ఇదే టాక్ ఇక్కడ కూడా వినిపిస్తే సినిమా బడ్జెట్ దృశ్యా మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, చూద్దాం ఏం జరుగుతుందో… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here