సీతారామం(SitaRamam) సినిమాతో తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ ఆఫ్ కొత్త(King Of Kotha Telugu Business) ఆడియన్స్ ముందుకు ఈ గురువారం రిలీజ్ అవ్వడానికి సిద్దం అవుతూ ఉండగా…
హీరో స్వయంగా తెలుగు లో సినిమాను బాగానే ప్రమోట్ చేసుకోగా సినిమా ఈ వీక్ లో భారీ పోటిలో రిలీజ్ కి సిద్ధం అవ్వగా ట్రైలర్ క్లిక్ అయినా కూడా అనుకున్న రేంజ్ లో అయితే ప్రస్తుతం బజ్ అయితే లేదని చెప్పాలి. కానీ సినిమాకి కనుక పాజిటివ్ టాక్ వస్తే…
కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే అవకాశం ఉన్న ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి బిజినెస్ ను సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా నైజాంలో 2 కోట్లు, సీడెడ్ లో 80 లక్షలు ఆంధ్రలో 2.2 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ ను…
సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు రాబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో టోటల్ బిజినెస్ లెక్క ఇప్పుడు 5 కోట్ల రేంజ్ వాల్యూ బిజినెస్ ను అందుకోగా సినిమా తెలుగు లో క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఇప్పుడు మొత్తం మీద 5.50 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.
సినిమా కి టాక్ బాగుంటే ఈ మొత్తాన్ని ఇతర సినిమాల పోటి ఉన్నా కూడా సొంతం చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీక్ లో పోటి ని తట్టుకుని ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. ఇక వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో లెక్కలు క్లియర్ వచ్చాకా అప్ డేట్ చేస్తాం…