సినిమాలు నిర్మించేది లాభాల కోసమే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఏవి ఎలా ఉన్నా చివరికి సినిమా వల్ల నష్టమా లాభామా అనేదే చూస్తూ ఉంటారు ఎక్కువ మంది. ఇక సినిమా నిర్మాతలు కూడా చాలా వరకు ఇదే ఫార్ములాని నమ్ముతారు. సినిమాల డిజిటల్ రిలీజ్ లు ఈ మధ్య కామన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఒకప్పుడు సినిమాలు రిలీజ్ అయ్యాక నెలల తర్వాత గాని సినిమాలు టెలివిజన్ లో వచ్చేవి కావు.
కానీ అది మారుతూ వచ్చి నెల రోజుల లోపే కూడా డిజిటల్ రిలీజ్ లు అవుతున్నాయి, కరోనా టైం లో ఏకంగా డైరెక్ట్ గా డిజిటల్ నే సొంతం చేసుకున్న సినిమాలు అనేకం ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా అత్యంత భారీ క్రేజ్ తో వచ్చిన కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్…
నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ ను థియేట్రికల్ రిలీజ్ అయిన 16 వ రోజునే అమెజాన్ ప్రైమ్ లో కూడా లాభం కోసం రిలీజ్ చేశారు. దాంతో సినిమా యూనిట్ పై అందరూ కోపంగా ఉండగా థియేటర్ ఓనర్లు మరింత ఎక్కువ కోపంగా ఉన్నారు. దాంతో సినిమా యూనిట్ తో వాళ్ళు గొడవకి దిగారు.
మీరు ఇలా లాభాల కోసం రిలీజ్ ను ఇష్టం వచ్చినట్లు ప్లాన్ చేసుకున్నారు కదా… ఇప్పుడు సినిమా థియేట్రికల్ రన్ లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లో మాకు 10% ప్రాఫిట్ ఇవ్వండి… అంటూ కండీషన్ పెట్టారు. దాంతో లాంగ్ రన్ అనుకున్న మాకు నష్టాలు ఉండవు అని చెప్పుకొచ్చారు. దాంతో నిర్మాతలు కంగుతిని అలా ఎలా చేస్తామంటూ ముందు నో చెప్పినా తర్వాత మాత్రం….
17 వ రోజు నుండి ఎంత వసూల్ చేస్తే అంతలో 10% వాటా ఇస్తామంటూ చెప్పుకొచ్చారట. దానికి థియేటర్ ఓనర్లు ఇప్పుడు సినిమా డిజిటల్ రిలీజ్ చేశాక థియేటర్స్ కి ఎవరు వస్తారు అంటూ నో చెప్పారట. ప్రస్తుతం ఇచే చర్చ జరుగుతుందట అక్కడ. మరి ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి…