Home న్యూస్ కొండ పొలం ట్రైలర్ రివ్యూ…ఇది కూడా బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉంది!!

కొండ పొలం ట్రైలర్ రివ్యూ…ఇది కూడా బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉంది!!

1029
0

ఉప్పెన సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్న పంజా వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ కొండపొలం సినిమా లాస్ట్ ఇయర్ కేవలం నెలన్నర టైం లోనే షూటింగ్ మొత్తం పూర్తీ చేసుకుని ఆడియన్స్ ముందుకు డైరెక్ట్ గా డిజిటల్ లో వస్తుంది అన్న వార్తలు వచ్చాయి కానీ సినిమా రిలీజ్ ను ఇప్పుడు అక్టోబర్ 8 న కన్ఫాం చేశారు మేకర్స్… ఇక సినిమా అఫీషియల్….

ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేయగా ట్రైలర్ లోనే సినిమా కథ మొత్తాన్ని చెప్పేశారు…. నల్లమల్ల అడువుల్లో నివసించే మారు మ్రూల గ్రామానికి చెందిన హీరో చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేసినా హీరోని రిజక్ట్ చేస్తారు, దాంతో ఊరికి తిరిగి వచ్చి తన తండ్రితో…

కలిసి కొండపొలం లో గొర్రెలను కాచే పని చేస్తాడు హీరో…అక్కడే హీరోయిన్ రకుల్ ప్రీత్ తో పరిచయం ప్రేమ మొదలు అవ్వగా… ఒక పెద్ద పులి గొర్రెలను అప్పుడప్పుడు చంపుతుంది… మరో పక్క కొందరు ఆ అడవిని దోచుకోవాలని చూస్తారు.. మరి హీరో అలాగే ఆ ఊరి వాళ్ళు…

ఆ పులి ని అడవిని దోచుకోవాలని చూసిన వాళ్ళని ఎలా ఎదిరించారు అన్నది సినిమా కథగా ట్రైలర్ లో చూపెట్టారు… వైష్ణవ్ తేజ్ ఫస్ట్ సినిమా కన్నా ఇంకా బెటర్ అయ్యాడు, రకుల్ ప్రీత్ సింగ్ లుక్స్ ఏమాత్రం సెట్ అవ్వలేదు, ఇద్దరి పెయిర్ పర్వాలేదు అనిపించగా ట్రైలర్ కి ఎం ఎం కీరవాణి అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బిగ్గెస్ట్ ప్లస్ గా నిలిచింది అని చెప్పాలి.

అలాగే డైరెక్టర్ క్రిష్ తక్కువ టైం లో ఇంత క్వాలిటీ గా సినిమాను తెరకెక్కించడం విశేషం అని చెప్పొచ్చు. మొత్తం మీద ట్రైలర్ సినిమా పై ఉన్న అంచనాలను పెంచగా మొదటి సినిమా ఉప్పెన లాగే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ గా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఇక ట్రైలర్ కి 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here