Home న్యూస్ కొండ పొలం టోటల్ థియేటర్స్, బుకింగ్స్, ఫస్ట్ డే ఎంత రావొచ్చు!!

కొండ పొలం టోటల్ థియేటర్స్, బుకింగ్స్, ఫస్ట్ డే ఎంత రావొచ్చు!!

1620
0

ఉప్పెన సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి సినిమా తోనే సంచలన విజయాన్ని నమోదు చేసిన పంజా వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా కొండ పొలం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లోనే రిలీజ్ కి సిద్ధం అవుతుంది, ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా నే అయినా కొండ పొలం సినిమా జానర్ ఎక్స్ పెరి మెంటల్ మూవీ అవ్వడం తో సినిమా బిజినెస్ తక్కువే జరిగింది.

సినిమా ఓవరాల్ గా 7.5 కోట్ల రేంజ్ బిజినెస్ ను అందుకోగా బ్రేక్ ఈవెన్ కోసం సినిమా 8 కోట్ల మార్క్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. ఇక సినిమా టోటల్ థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే… నైజాం లో సినిమా 208 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా టోటల్ ఆంధ్రలో…

360 థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. దాంతో టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో సినిమా మొత్తం మీద 570 థియేటర్స్ లో రిలీజ్ కానుండగా వరల్డ్ వైడ్ గా సినిమా 720 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్…

రెండు మూడు రోజుల ముందుగానే మొదలు అవ్వగా సినిమా కి ఉప్పెన తో పోల్చితే మినిమం ఇంపాక్ట్ లేదు, కానీ సినిమా జానర్ డిఫెరెంట్ కాబట్టి ఇక సినిమా మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి ఆడియన్స్ ముందుకు రాబోతుంది. పాజిటివ్ టాక్ వస్తే సినిమా షో షోకి కలెక్షన్స్ ని పెంచుకుంటూ వెళ్ళే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమా మొదటి రోజు…

1.2-1.5 కోట్ల రేంజ్ షేర్ ని సాధించవచ్చు. ఇక బుకింగ్స్ ఇంప్రూవ్ అయ్యి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా బాగుంటే సినిమా 2 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకోవచ్చు. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది, ఓపెనింగ్స్ పరంగా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో అనేది చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here