Home న్యూస్ 24 గంటలు ఓవర్…సెన్సేషనల్ రెస్పాన్స్ ఇది!!

24 గంటలు ఓవర్…సెన్సేషనల్ రెస్పాన్స్ ఇది!!

594
0

మొదటి సినిమా ఉప్పెన తోనే సంచలనం సృష్టించిన పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాకే ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన రికార్డులను నమోదు చేసి సంచలనం సృష్టించాడు.. ఆ సినిమా రికార్డులు ఫస్ట్ మూవీ హీరోలకు ఫ్యూచర్ లో కూడా బిగ్గెస్ట్ టార్గెట్ లు గా చెప్పుకోవచ్చు, ఇక ఈ సినిమా రిలీజ్ లేట్ అవ్వడంతో ఈ గ్యాప్ లో చేసిన మరో సినిమా కొండపొలం డిజిటల్ లో రిలీజ్ అవ్వాల్సింది కానీ…

ఉప్పెన సాధించిన సెన్సేషనల్ విజయంతో బాక్స్ ఆఫీస్ దగ్గర అక్టోబర్ 8 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, క్రిష్ డైరెక్షన్ లో కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ కి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా రీసెంట్ గా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేయగా…

ఆడియన్స్ నుండి సినిమా ట్రైలర్ కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడమే కాదు యూనిక్ కాన్సెప్ట్ తో వస్తూ ఉండటంతో సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తి కూడా పెరిగి పోయింది, దాంతో ట్రైలర్ రిలీజ్ తర్వాత ఇప్పుడు సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి అని చెప్పాలి..

ఇక ఈ ట్రైలర్ మొత్తం మీద 24 గంటలను పూర్తీ చేసుకోగా యూట్యూబ్ లో సాలిడ్ రెస్పాన్స్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుని సత్తా చాటుకుంది, యూట్యూబ్ లో అప్ డేట్ అయిన వ్యూస్ కౌంట్ 4.64 మిలియన్ మార్క్ ని అందుకుని రచ్చ చేయగా లైక్స్ 186K మార్క్ ని క్రాస్ చేసి దుమ్ము లేపడం విశేషం అనే చెప్పాలి…

ఉప్పెన ట్రైలర్ 24 గంటల్లో 5.12 మిలియన్ వ్యూస్ ని అలాగే 284.5K లైక్స్ ని సొంతం చేసుకుంది, ఫస్ట్ మూవీ కి రిలీజ్ కి ముందు వచ్చిన హైప్ వేరు కాబట్టి ఇప్పుడు రెండో సినిమా మరీ ఆ రేంజ్ లో రచ్చ చేయకున్నా కానీ ఓవరాల్ గా డీసెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఓవరాల్ గా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here