Home న్యూస్ కొండపొలం రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

కొండపొలం రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

ఉప్పెన సినిమా తో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన పంజా వైష్ణవ్ తేజ్ ఇప్పుడు చేసిన రెండో సినిమా కొండ పొలం క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కగా నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేయగా హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి ని తీసుకోవడంతో సినిమా పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకుందా లేదా తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే… సెల్ఫ్ కాన్ఫిడెంట్స్ తక్కువగా ఉన్న హీరో బి టెక్ కంప్లీట్ చేసిన తర్వాత వెళ్ళిన ప్రతీ ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవుతాడు. ఇలాంటి టైం తిరిగి ఊరికి రాగా అక్కడ తన తాత అయిన కోట శ్రీనివాస్ రావ్ సలహా మేరకు తన తండ్రితో కలిసి…

గొర్రెల మందతో కొండపొలం కొంత టైం వరకు చేయడానికి ఒప్పుకుంటాడు, గొర్రెలతో నల్లమల్ల అడవులకు వెళ్ళే హీరో ఎలాంటి పాఠాలు నేర్చుకున్నాడు. అక్కడ తను ఫేస్ చేసిన పరిస్థితులు ఏంటి, హీరోయిన్ తో లవ్ స్టొరీ ఏంటి, చివరికి తన లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది అన్న విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

పెర్ఫార్మెన్స్ పరంగా మొదటి సినిమాకే బెటర్ యాక్టింగ్ తో మెప్పించిన వైష్ణవ్ తేజ్ రెండో సినిమా కి మరింత పరిణితితో నటించి మెప్పించగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆకట్టుకుంది, సాయి చంద్ మరియు కోటా శ్రీనివాసరావ్ ల రోల్స్ కూడా మెప్పించగా మిగిలిన యాక్టర్స్ కూడా ఆకట్టుకున్నారు. డైలాగ్స్ చాలా బాగా రాశారు, చాలా డైలాగ్స్ ఆలోచించేలా చేస్తాయి.

సంగీతం పర్వాలేదు అనిపించగా కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్ర్రం తన మార్క్ ఏంటో చూపెట్టాడు. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా సాగుతుంది… ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు, సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా క్రిష్ డైరెక్షన్ విషయానికి వస్తే… నవల ఆధారంగా సినిమాను తెరకెక్కించగా చాలా పాయింట్స్ ని బాగా డీల్ చేశాడు…

కానీ ఈ కథ రెగ్యులర్ మూవీస్ చూసే వాళ్ళకి కాదు, డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు, కొత్త కథలను చూడటానికి ఇష్టపడే వాళ్ళకి మాత్రమె… మీరు ఈ క్యాటగిరీకి చెందిన వాళ్ళు అయితేనే సినిమా మెప్పిస్తుంది, రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చూసే వాళ్ళకి సినిమా ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించినా సెకెండ్ ఆఫ్ బోర్ కొట్టడం ఖాయం…. తెరపై ఒక్కో సీన్ వస్తూ వెళుతూ ఉంటుంది కానీ…

అవి పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేసేలా ఉండవు, సెకెండ్ ఆఫ్ లెంత్ ఎక్కువ అయిన ఫీలింగ్ కలుగుతుంది, పులి తో ఫైట్ సీన్స్ VFX అంతగా ఆకట్టుకోలేదు…ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు… కానీ కొత్త కథలను ఇష్టపడే వాళ్లకి సినిమా పడుతూ లేస్తూ ఒక జర్నీ లా సాగే సినిమా అక్కడక్కడా బోర్ కొట్టినా కథతో మనం ట్రావెల్ అయ్యేలా చేస్తుంది… కొంత భాగం ఆలోచించేలా చేసి మంచి ముగింపు తో సినిమా బాగుంది అనిపిస్తుంది…

మొత్తం మీద ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కథ పాయింట్ బాగుండటం, అందరి పెర్ఫార్మెన్స్, కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ చాలా బాగా రాసుకోవడం అని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే చాలా నెమ్మదిగా సాగే కథ, సెకెండ్ ఆఫ్ డ్రాగ్ అవ్వడం, లాంటివి మేజర్ డ్రా బ్యాక్స్….

మొత్తం మీద ముందే చెప్పినట్లు ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చూసే వాళ్ళకి కాదు, అయినా కొంచం ఓపికతో కష్టపడి చూస్తె పర్వాలేదు అనిపిస్తుంది, కానీ కొత్తదనం కూడుకున్న కథలను ఇష్టపడే వాళ్ళు కొంచం ఓపికతో చూస్తె సినిమా మెప్పిస్తుంది. మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here