Home న్యూస్ బింబిసార రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

బింబిసార రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ బింబిసార పై ఆడియన్స్ లో టాలీవుడ్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మినీ బాహుబలిని పోలిన విజువల్స్ తో భారీ గ్రాండియర్ తో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఆకట్టుకోవడంతో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అన్న ఆసక్తి మొదలు అవ్వగా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా భారీగా రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…

   

ముందుగా కథ పాయింట్ కి వస్తే… తానే దేవుడిని అలాగే రాక్షసుడిని అని ప్రకటించుకుని త్రిగర్తల సామ్రాజ్యాన్ని పాలించే బింబిసారుడు…. కాలగమనంలో ఈ బింబిసారుడు ప్రస్తుత కాలానికి వస్తాడు. అలా రావడానికి కారణం ఏంటి… ఇక్కడికి వచ్చాక బింబిసారుడిలో వచ్చిన మార్పులు ఏంటి… తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

కథ పాయింట్ లో మరిన్ని సర్పైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అవన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పెర్ఫార్మెన్స్ పరంగా ఇది కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో అనడంలో ఎలాంటి సందేహం లేదు, బింబిసారగా కళ్యాణ్ రామ్ జీవించేశాడు అని చెప్పాలి. ఇక హీరోయిజం ఎలివేట్ సీన్స్ లో కూడా దుమ్ము దులిపేశాడు…

కాథరిన్ తెస్రా, సంయుక్తా మీనన్ ల సీన్స్ చాలా తక్కువే ఉన్నా మెప్పించారు. మిగిలిన స్టార్ కాస్ట్ పెద్దదిగానే ఉన్నప్పటికీ ఉన్నంతలో అందరూ పర్వాలేదు అనిపించేలా మెప్పించారు. ఇక సంగీతం విషయానికి వస్తే కీరవాణి పాటలు సిట్చువేషన్ కి తగ్గట్లు మెప్పించాగా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం రఫ్ఫాడించాడు అనే చెప్పాలి. ఫైట్ సీన్స్ కి ఎలివేట్ సీన్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ఇంప్రెస్ చేసింది.

ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పై మరింత శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ అదుర్స్ అనిపించగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా మెప్పించాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే వశిష్ట ఎంచుకున కథ పాయింట్ చాలా ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నప్పటికీ అక్కడక్కడా సినిమాలో ఫ్లాస్ లేక పోలేదు…

కానీ ఓవరాల్ గా సినిమా చూస్తున్న ఆడియన్స్ కి ఓ డిఫెరెంట్ ఫీల్ ని కలించడం విషయంలో మైతలాజికల్ కాన్సెప్ట్ కి ఫాంటసీని జోడించి టైం ట్రావెల్ చేయించడం ఈ పాయింట్స్ చాలా వరకు ఇంప్రెసివ్ గా చెప్పడంతో కొన్ని డౌన్ ఫాల్స్ ఉన్నప్పటికీ కొత్త దర్శకుడు అవ్వడంతో తన రేంజ్ లో చాలా బాగా డైరెక్ట్ చేశాడు వశిష్ట.. అలాగే ఈ భారీ ప్రాజెక్ట్ ను బాగా హ్యాండిల్ చేశాడు అని చెప్పాలి.

మొత్తం మీద సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్, భారీ గ్రాండియర్, మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్, ఓవరాల్ కథ కాన్సెప్ట్ అని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే అక్కడక్కడా కొంచం స్లో అవ్వడం, విలన్ రోల్ పవర్ ఫుల్ గా లేక పోవడం అని చెప్పాలి.

సినిమా పై అంచనాలతో వెళ్ళే ఆడియన్స్ కానీ ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్ళే ఆడియన్స్ కి కానీ చాలా వరకు సినిమా మెప్పించడం ఖాయం, మొత్తం మీద బింబిసార సినిమా అయిపోయే టైం కి ఆడియన్స్ ఓ మంచి అలాగే డిఫెరెంట్ మూవీ చూశాం అన్న ఫీలింగ్ తో బయటికి రావడం ఖాయం… మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 3 స్టార్స్…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here