మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ క్రాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పటి నుండి సెన్సేషనల్ కలెక్షన్స్ తో జోరు చూపుతూ దూసుకు పోయి రవితేజ కెరీర్ లో ఆల్ టైం నంబర్ 1 మూవీ గా రికార్డ్ సృష్టించగా సినిమా లాంగ్ రన్ లో రెట్టించిన జోరు చూపుతూ సంచలనం సృష్టించింది. సినిమా డిజిటల్ రిలీజ్ అయ్యాక కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డులతో దుమ్ము లేపడం విశేషం….
సినిమా రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఆహా యాప్ లో సాలిడ్ గా వ్యూస్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం. సినిమా మొదటి రోజు ఆహా యాప్ లో 3.2 లక్షల యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకోగా ఓవరాల్ గా వ్యూస్ లెక్క…
2.2 మిలియన్స్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపింది. ఇక సినిమా వీకెండ్ మరియు వర్కింగ్ డే కలిపి 4 రోజుల్లో మరోసారి సెన్సేషనల్ వ్యూస్ తో రచ్చ చేసింది అని చెప్పాలి. సినిమా ఓవరాల్ గా 1 మిలియన్ వరకు యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా…
ఓవరాల్ వ్యూస్ కౌంట్ 5 మిలియన్స్ వరకు ఉంటుంది అని ట్రేడ్ లో టాక్ ఉంది… ఇది నిజంగానే సెన్సేషనల్ వ్యూస్ కౌంట్ గా చెప్పుకోవాలి. సాలిడ్ వ్యూస్ తో దూసుకు పోతున్న ఈ సినిమా ఆహా యాప్ వాళ్ళ హైయెస్ట్ వ్యూయర్ షిప్ సొంతం చేసుకున్న సినిమాగా నిలవబోతుంది అని చెప్పాలి. సినిమాను మొత్తం మీద వారం లేట్ గా టెలికాస్ట్ చేసిన ఆహా వాళ్ళు 8 కోట్ల రేంజ్ లో రేటు చెల్లించగా…
మొత్తం మీద 1 మిలియన్ వ్యూస్ కి ఎంత వరకు రికవరీ చేశారు అన్నది ఎస్టిమేట్ వేస్తె… వాళ్ళ ఒక నెల రేటు 50 ని టికెట్ రేటుగా అనుకుని 1 మిలియన్ వ్యూస్ తో లెక్కేస్తే… 5 కోట్ల రేంజ్ లో రికవరీని సొంతం చేసుకుని ఉండొచ్చని అంచనా వేయవచ్చు. ఓవర్సీస్ రేట్లు ఇంకా ఎక్కువే ఉంటాయి కాబట్టి ఈ లెక్క మరింత ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని చెప్పాలి.