బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోయడానికి సిద్ధం అయిన సినిమా సడెన్ గా రిలీజ్ ఆగిపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అందరికీ తెలిసిందే. మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ క్రాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని చోట్ల షోలు పడ్డ తర్వాత సడెన్ గా నిర్మాత పాత సినిమా అప్పుల వలన బుకింగ్స్ ని సినిమాను ఆపేశారు. సినిమా నిర్మాత ఠాగూర్ మధు ఇది వరకు…
విశాల్ అయోగ్య సినిమాను 10 కోట్లకు కొనగా సినిమా డిసాస్టర్ రిజల్ట్ వలన డబ్బులు మొత్తం రిటర్న్ ఇవ్వలేదు…దాంతో ఆ నిర్మాత ఇది వరకే కేసు వేయగా అప్పుడు పరిస్థితులు సద్దుకున్నాయి అనుకున్నా సరిగ్గా రిలీజ్ రోజు పరిస్థితులు తిరగబడి రిలీజ్ సడెన్ గా ఆగిపోయింది.
మొత్తం మీద నిర్మాత 6 కోట్ల దాకా డబ్బు తిరిగి ఇవ్వాల్సి ఉండగా అవి ఇస్తేనే రిలీజ్ అని తేల్చేశారు…21 వ తేదీ వరకు చివరి డేట్ ఇవ్వగా ఈ మొత్తం కట్టిన వెంటనే సినిమా రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. దాంతో ఇప్పుడు నిర్మాత ఆ పనిలోనే ఉన్నారని సమాచారం.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు మిస్ చేసుకున్న క్రాక్ సినిమా… ఈవినింగ్ షోల నుండి సినిమా ప్రదర్శితం అయ్యేలా ఉంది కానీ ఏ నిమిషానికి ఏమైనా జరగవచ్చు అంటున్నారు. మొత్తం మీద భారీ లెవల్ లో రికార్డ్ రిలీజ్ ను సొంతం చేసుకున్న క్రాక్ సినిమాకి ఓపెనింగ్స్ పరంగా ఇది గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. కానీ ఇక్కడ ఒక్క విషయం గురించి చెప్పాలి.
బుకింగ్స్ చాలా లేట్ గా ఓపెన్ చేయడంతో అడ్వాన్స్ బుకింగ్స్ స్లోగా బుక్ అవుతున్నా కానీ ఆఫ్ లైన్ లో థియేటర్స్ దగ్గర జనాలు బుకింగ్స్ కానీ భారీగా ఉన్నాయి. ఆఫ్ లైన్ లో రవితేజ ఇప్పటికీ బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్స్ లో ఒకరిగా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితులు వెంటనే చక్కదిద్దుకుని వెంటనే సినిమా థియేటర్స్ లో షోలు స్టార్ట్ అవ్వాలని కోరుకుందాం…