మాస్ మహారాజ్ రవితేజ గోపీచంద్ మలినేని ల కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ క్రాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. సినిమా పై భారీ క్రేజ్ నెలకొన్న నేపధ్యంలో సినిమా వరల్డ్ వైడ్ గా 1100 వరకు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రెండు రోజుల ముందు నుండే మొదలు అయినప్పటికీ కూడా…
అన్ని సెంటర్స్ లో బుకింగ్స్ మొదలు కాలేదు…. చాలా సెంటర్స్ లో టికెట్ హైక్స్ పై ఫైనల్ నిర్ణయం తీసుకోవడం లేట్ అవుతూ రావడం తో సినిమా బుకింగ్స్ పై అది ఇంపాక్ట్ చూపింది. ఆఫ్ లైన్ లో బుకింగ్స్ చాలా తక్కువ చేశారు కాబట్టి ఆన్ లైన్ బుకింగ్స్…
ముఖ్యం అవ్వగా ఇక్కడ బుకింగ్స్ లేట్ అవ్వడం లాంటివి ఇబ్బంది పెడుతున్నాయి. మొదటి రోజు మార్నింగ్ షోల టైం కి పరిస్థితులు అన్నీ సెట్ అవుతాయి కానీ బుకింగ్స్ పై ముందే అన్నీ సెట్ చేసుకుని ఉంటె పరిస్థితి మరింత బాగా ఉండేదని చెప్పొచ్చు. ప్రస్తుతం మొత్తం మీద ఆన్ లైన్ బుకింగ్స్…
ఓపెన్ అయిన సెంటర్స్ లో టికెట్ హైక్స్ భారీగా ఉండటం తో బుకింగ్స్ మెల్లి మెల్లిగా పుంజుకుంటున్నాయి. ప్రస్తుతానికి 20% వరకు బుకింగ్స్ జరగగా మొదటి రోజు మార్నింగ్ షోల టైం కి ఈ లెక్క 40% కి పైగా వెళ్ళే అవకాశం ఉంది. ఇక ఆయా ఏరియాలో టికెట్ హైక్స్ ని బట్టి టోటల్ లెక్క ఎంత వరకు వెళుతుంది అన్నది చెప్పగలం. థియేటర్స్ కౌంట్ ఎక్కువ కాబట్టి బుకింగ్స్ కొంచం తగ్గినా కానీ…
బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఓపెనింగ్స్ అదిరిపోయే విధంగా ఉండటం ఖయామని చెప్పొచ్చు. మొత్తం మీద ప్రస్తుతానికి ఉన్న బుకింగ్స్ ను బట్టి చూస్తె 3-4 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ చాలా మంచి ఓపెనింగ్స్ గా చెప్పుకోవాలి, ఇక టాక్ ని బట్టి టికెట్ రేట్లని బట్టి మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి…