మాస్ మహారాజ్ రవితేజ గోపీచంద్ మలినేని ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ క్రాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో జనవరి 9 న రిలీజ్ ను సొంతం చేసుకోగా, కొన్ని చోట్ల సినిమా షోలు పడ్డా.. తర్వాత సినిమా రిలీజ్ ను అడ్డుకున్నారు. సినిమా నిర్మాత పాత సినిమా అప్పుల వలన రిలీజ్ ను ఆపేసి బుకింగ్స్ ని ఆపేశారు. దాంతో అవి క్లియర్ చేస్తేనే సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పగా…
దానికి టైం పడుతుంది అన్న టాక్ గట్టిగా స్ప్రెడ్ అవ్వగా ఈ లోపు ఇండస్ట్రీ పెద్దలు క్రాక్ సినిమా నిర్మాతలు పరిస్థితులను సద్దుమనిగేలా చేశారు. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈవినింగ్ షోల నుండి రిలీజ్ కి సిద్ధం అయింది. కానీ ఈవినింగ్ షోల సమయానికి…
థియేటర్స్ ఓనర్లకి అగ్రిమెంట్స్ ఏవి కూడా రాకపోవడంతో అవి వచ్చిన వాళ్ళు సినిమాను ప్రదర్శితం చేయడం మొదలు పెట్టారు. మొత్తం మీద ఫస్ట్ షోల టైం కి అన్ని చోట్లా అగ్రిమెంట్లు అందకపోయినా కానీ సెకెండ్ షోల సమయానికి పరిస్థితులు అన్నీ సద్దుకుని సినిమా రిలీజ్…
కాబోతుందని సమాచారం. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కి గట్టి ఎదురు దెబ్బ పడినా కానీ సినిమా కి ఉన్న హైప్ కి భారీ ఓపెన్ గ్రౌండ్ కి ఎలాగైనా ఈ రోజు రిలీజ్ అయితే మిగిలిన మూడు రోజుల ఓపెన్ గ్రౌండ్ లో అయినా సినిమా దుమ్ము లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ ఇదే జరగాలి అని కోరుకున్నారు. అనుకున్నట్లే సినిమా ఈవినింగ్ షోల నుండి రిలీజ్ అయ్యింది.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా చాలా తక్కువ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్నా కానీ రెండో రోజు నుండి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం చేసే కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. రవితేజ నుండి ఫ్యాన్స్ కామన్ ఆడియన్స్ ఎదురు చూస్తున్న సాలిడ్ కంబ్యాక్ ఈ మూవీనే అవ్వాలని మరోసారి కోరుకుందాం…