Home న్యూస్ క్రాక్ మూవీ రివ్యూ…పోతరాజు వీర శంకర్ మాస్ జాతర!!

క్రాక్ మూవీ రివ్యూ…పోతరాజు వీర శంకర్ మాస్ జాతర!!

0

మాస్ మహారాజ్ రవితేజ నుండి ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఓ సాలిడ్ కంబ్యాక్ మూవీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు, ఎట్టకేలకు ఆ ఆశలను నిజం చేయడానికి వచ్చిన క్రాక్ మూవీ రిలీజ్ రోజున అనేక అవరోధాలను ఎదురుకుని ఎలాగోలా మొదటి రోజు సెకెండ్ షోలను ప్రీమియర్ షోలగా మార్చుకుని రిలీజ్ అయ్యింది. మరి ఆడియన్స్ ఎదురు చూపులు ఎలా నిజం అయ్యాయి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే… సిన్సియర్ పోలిస్ ఆఫీసర్ అయిన రవితేజ తన చుట్టూ ఎలాంటి తప్పు జరిగినా సరిచేస్తాడు, బ్యాగ్రౌండ్ చూపి బలుపు చూపిస్తే తాట తీస్తాడు, అలాంటి పోలిస్ ఓ ముగ్గురు తోపులను ఎలా ఒక్కో చోట ఎలా తలలు వంచి తన పవర్ చూపాడు అన్నది సినిమా కథ…

మెయిన్ పాయింట్ ఇదే అయినా సినిమాలో సబ్ ప్లాట్స్ ఉంటాయి, అవి రివీల్ చేస్తే కథ ఎక్కువ లీక్ అయినట్లే… ఇక పెర్ఫార్మెన్స్ పరంగా ఇది పూర్తిగా రవితేజ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి, మాస్ ఎలివేషన్స్ కానీ కామెడీ టైమింగ్ కానీ, ఫైట్స్ లో మాస్ అప్పీల్ కానీ…

రవితేజ వింటేజ్ రవితేజ లా మారిపోయి విక్రమార్కుడు తర్వాత ఆ రేంజ్ లో ఫీల్ అయ్యే పవర్ ఫుల్ రోల్ తో మెస్మరైజ్ చేశాడు… ఇక శ్రుతిహాసన్ రోల్ మొదట్లో కొంచం బోర్ కొట్టించినా సెకెండ్ ఆఫ్ లో ఓ ట్విస్ట్ అండ్ మాస్ మూమెంట్స్ తో తను కూడా బాగా ఆకట్టుకుంది. ఇక విలన్స్ లో సముద్రఖని ఆకట్టుకున్నా మరీ పవర్ ఫుల్ రోల్ కాదు. ఇక వరలక్ష్మీ రోల్ గురించి బాగా టాక్ వచ్చినా సినిమాలో ఏమి లేదు…

మిగిలిన నటీనటులు ఉన్నంతలో మెప్పించాగా… సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో తమన్ మెస్మరైజ్ చేశాడు, సాంగ్స్ కొన్ని పర్వాలేదు అనిపించినా రెండు మూడు పాటలు బాగా మెప్పించాయి కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ కొట్టాడు… మాస్ మహారాజ్ కి బెస్ట్ ఎలివేషన్స్ అనిపించే రేంజ్ లో మాస్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో అక్కడక్కడా వీక్ అనుకున్న సీన్స్ ని కూడా తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేశాడు.

ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పర్వాలేదు అని చెప్పాలి, సినిమా టేక్ ఆఫ్ అవ్వడానికి కొంచం టైం పట్టినా తర్వాత ఫస్టాఫ్ మొత్తం అదిరిపోతుంది, సెకెండ్ ఆఫ్ కొంచం స్లో అవుతుంది అనుకున్న టైం లో మాస్ సాంగ్ లేదా సాలిడ్ ఫైట్ తో బాలెన్స్ చేశారు. ఇక సినిమాటోగ్రఫీ సినిమాకి…

మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.. కమర్షియల్ మూవీస్ లో ఈ రేంజ్ క్వాలిటీ సినిమాటోగ్రఫీ చాలా రేర్ అని చెప్పాలి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇక గోపీచంద్ మలినేని డైరెక్షన్ విషయానికి వస్తే అనుకున్న కథ పాయింట్ లో పెద్దగా ఏమి లేదు కానీ రవితేజ రోల్ ని తీర్చిదిద్దిన విధానం మాస్ ఎలిమెంట్స్ లాంటివి అద్బుతంగా తెరకెక్కించాడు. కానీ కథ పాయింట్ చాలా తిన్ లైన్ అవ్వడం…

టేక్ ఆఫ్ అవ్వడానికి కొంచం టైం పట్టడం, సెకెండ్ ఆఫ్ లో కొంచం స్లో అయిన ఫీలింగ్ అక్కడక్కడా కలిగించడం చిన్న చిన్న మైనస్ పాయింట్స్. కానీ అవేవి లెక్క చేయనివ్వకుండా రవితేజ రోల్ మెప్పించేలా డైరెక్షన్ తో అదరగొట్టేశాడు గోపీచంద్… మొత్తం మీద సినిమా రవితేజకి బిగ్గెస్ట్ కంబ్యాక్ మూవీ…

గట్టిగా చెప్పాలి అంటే… విక్రమార్కుడు తర్వాత ఆ రేంజ్ లో పవర్ ఫుల్ సీన్స్ పడ్డ సినిమా, బలుపు కి ఈక్వల్ లేదా మించే రేంజ్ లో ఉన్న సినిమా.. పవర్ బెంగాల్ టైగర్ కన్నా బెటర్ మూవీ గా చెప్పుకోవాలి. మొత్తం మీద ఇది రవితేజ మాస్ కంబ్యాక్ ఇచ్చే మూవీ అని చెప్పాలి.

టోటల్ గా సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 3 స్టార్స్…. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సెన్సేషనల్ కలెక్షన్స్ ని మిస్ చేసుకున్న మిగిలిన 3 రోజుల ఓపెన్ గ్రౌండ్ లో దుమ్ము లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా రవితేజ కి సాలిడ్ కంబ్యాక్ ఈ సినిమా ఇచ్చే అవకాశం అంచనాలను మించి ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here