మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ క్రాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చేసింది. డిజిటల్ రిలీజ్ అవ్వడం, ప్రింట్ బయటికి వచ్చేయడం లాంటివి సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపింది. అయినా కానీ ఇప్పటికే సినిమా చేయాల్సిన రచ్చ అంతా చేసేసింది అని చెప్పాలి. ఇలాంటి టైం లో సడెన్ గా సినిమాను తమిళ్ లో అలాగే మలయాళంలో…
డబ్ చేసి రిలీజ్ చేయాలనీ నిర్ణయం తీసుకుని ఈ నెల 5 న రిలీజ్ చేయగా మొదటి వీకెండ్ లో సర్ప్రైజింగ్ గా సినిమా మంచి కలెక్షన్స్ నే సాధించింది. 32 లక్షల రేంజ్ లో గ్రాస్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక సినిమా ఇప్పుడు మొత్తం మీద 8 రోజులకు గాను బాక్స్ ఆఫీస్ దగ్గర…
సాధించిన కలెక్షన్స్ లెక్క బయటికి వచ్చింది. సినిమా తమిళ్ లో మలయాళంలో రెండు చోట్లా కలిపి 8 రోజులు పూర్తీ అయ్యే టైం కి 60 లక్షల రేంజ్ లో గ్రాస్ ని 31 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇందులో తమిళ్ లో సినిమా 8 రోజుల్లో 50 లక్షల గ్రాస్ ని సొంతం చేసుకోవడం విశేషం.
మలయాళం లో 10 లక్షల గ్రాస్ ని సాధించిన ఈ సినిమా కి ఇప్పటి వరకు అక్కడ ప్రమోషన్ చేయలేదు, ఒక టీసర్ రిలీజ్ చేయలేదు, ట్రైలర్ లాంచ్ కూడా లేదు. అయినా కానీ అక్కడ ఉన్నంతలో సినిమా సాలిడ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి. కాగా రెండు చోట్లా కలిపి సినిమా రైట్స్ ని 26 లక్షల రేంజ్ రేటు కి అమ్మినట్లు ట్రేడ్ లో టాక్ ఉంది, ఆ లెక్కన సినిమా 8 రోజుల్లో…
సాధించిన టోటల్ కలెక్షన్స్ తో ప్రాఫిట్స్ ని కూడా తెచ్చిపెట్టింది అని చెప్పాలి. 5 లక్షల రేంజ్ ప్రాఫిట్ ని బిజినెస్ మీద సొంతం చేసుకున్న ఈ సినిమా ముందే చెప్పినట్లు ఎలాంటి ప్రమోషన్ లు చేయకున్నా కానీ సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ పవర్ ని చూపింది. మన సినిమాలు ఇతర భాషల్లో మరింత ఫోకస్ పెట్టి ప్రమోషన్ లు చేస్తే ఇంకా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు.