మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ క్రాక్ కి ఆల్ టైం రికార్డ్ లెవల్ థియేటర్స్ దక్కాయి వరల్డ్ వైడ్ గా… సినిమా కి అనుకున్న రేంజ్ కన్నా కూడా భీభత్సమైన రికార్డ్ థియేటర్స్ కౌంట్ మొదటి 4 రోజులకు గాను సొంతం అయ్యింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోయడం ఖాయమని చెప్పొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా సెన్సేషనల్ కౌంట్ ని…
సొంతం చేసుకుంది…. రవితేజ కెరీర్ లో ఇది ఆల్ టైం హైయెస్ట్ థియేటర్స్ కౌంట్ గా చెప్పుకుంటున్నారు. మొత్తం మీద సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 800 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అనుకున్నా ఇప్పుడు ఏకంగా 970 వరకు వెళ్ళబోతుంది.
సినిమా మొత్తం మీద రిలీజ్ కానున్న థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే… నైజాం లో ఏకంగా 350 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా, సీడెడ్ లో 200 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక సినిమా ఆంధ్రాలో 420 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 970 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా, సినిమా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 70 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా ఓవర్సీస్ లో 50 థియేటర్స్ లో రిలీజ్ కానుంది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 1100 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి.
ఇది రవితేజ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ థియేటర్స్ కౌంట్ అని చెప్పాలి. 4 రోజుల ఓపెన్ గ్రౌండ్ లో సినిమా ఇన్ని థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోవడం మరో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఇక సినిమా కి జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోసే కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది.