ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ అనేది ఎప్పటి నుండో అన్ని ఇండస్ట్రీలలో ఉందని చెప్పాలి. సినిమా కి వచ్చిన కలెక్షన్స్ కానన ప్రమోషన్స్ కోసమో, రికార్డుల కోసమో కానీ అప్పుడప్పుడు ఎక్కువ ఫేక్ కలెక్షన్స్ ని పోస్టర్స్ లో రిలీజ్ చేస్తారు, వాళ్ళకి అవి రికార్డులా అనిపించవచ్చు కానీ ఒరిజినల్ కలెక్షన్స్ తెలిశాక మాత్రం భారీగా ట్రోల్స్ జరగడం అన్నది కామన్ గానే జరుగుతూ ఉంటుంది, రీసెంట్ గా కన్నడ ఇండస్ట్రీలో ఇలానే జరిగింది…
అక్కడ స్టార్స్ ఒకరైన దర్శన్ మంచి ఫాలోయింగ్ ఉన్నా కానీ తన సినిమాల కలెక్షన్స్ విషయంలో మాత్రం ఫేక్ పోస్టర్స్ వలన ట్రోల్స్ జరుగుతూ ఉంటాయి. 2021 టైంలో కూడా రాబర్ట్ అనే సినిమా తెలుగు లో డబ్ అవ్వగా వచ్చినవి చిల్లర కలెక్షన్స్ అయితే కోటల్లో గ్రాస్ వచ్చిందని పోస్టర్స్ రిలీజ్ చేసి ట్రోల్ అయ్యారు…
లేటెస్ట్ గా ఈ హీరో నటించిన కొత్త సినిమా క్రాంతి భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా 4 రోజుల్లో 25 కోట్ల రేంజ్ లో గ్రాస్ వస్తే ఏకంగా 109 కోట్ల రేంజ్ లో గ్రాస్ వచ్చిందని టీం సక్సెస్ పార్టీ కూడా చేసుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు ఫైనల్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
కర్ణాటకలో 48 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే అందుకుని 4 రోజుల్లో టీం చెప్పిన 109 కోట్ల కలెక్షన్స్ లో సగం మాత్రమే లైఫ్ టైంలో కలెక్ట్ చేసి నిరాశ పరిచింది. కానీ మిక్సుడ్ రెస్పాన్స్ తో ఉన్నంతలో డీసెంట్ కలెక్షన్స్ నే సినిమా సాధించిందని అంటున్నారు.