Home న్యూస్ కృష్ణ అండ్ హిస్ లీల రివ్యూ….OTT లో బెస్ట్ ఇదే!!

కృష్ణ అండ్ హిస్ లీల రివ్యూ….OTT లో బెస్ట్ ఇదే!!

0

రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు అన్నీ కూడా అక్కడ రిలీజ్ అయ్యే అవకాశం లేక పోవడం తో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకుంటూ ఉండగా వాటిలో ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకున్న సినిమాలు అయితే లేవు. కాగా నిన్న సైలెంట్ గా ట్రైలర్ తో పాటు సినిమా ఒక సినిమా డిజిటల్ రిలీజ్ ని కూడా సైలెంట్ గా సొంతం చేసుకుంది. ఆ సినిమా నే కృష్ణ అండ్ హిస్ లీల.

క్షణం డైరెక్టర్… రవికాంత్ డైరెక్షన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. గుంటూరు టాకీస్ తో మెప్పించిన సిద్ధూ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా లో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్ మరియు షాలిని లు హీరోయిన్స్ గా నటించగా.. సురేష్ ప్రొడక్షన్స్ మరియు వియా కాం 18 సంస్థ సంయుక్తంగా సినిమాను నిర్మించారు.

ఇక సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ కి వస్తే కి తండ్రి దూరం అయిన కొడుకు తల్లిదగ్గరే పెరగగా తన కాలేజ్ డేస్ లో ఒక అమ్మాయి తో లవ్ బ్రేక్ అప్ అవ్వగా కొద్ది గ్యాప్ తోనే మరో అమ్మాయితో లవ్ లో పడతాడు.

ఇంతలో తిరిగి మొదటి అమ్మాయి తిరిగి రావడం తో ఎవరిని చూస్ చేసుకోవాలో అన్న డౌట్ లో ఉన్న హీరో కి మరో అమ్మాయి పరిచయం అవుతుంది. మరి ఫైనల్ గా హీరో ఎవరిని ఎంచుకున్నాడు. తన ప్రేమ కథ సుఖాంతం అయ్యిందా లేదా అన్నది అసలు కథ.

నేటి జనరేషన్ యూత్ కనెక్ట్ అయ్యే పెర్ఫెక్ట్ సినిమా కృష్ణ అండ్ హిస్ లీల… లైట్ ఎంటర్ టైన్మెంట్, మంచి పెర్ఫార్మెన్స్, లవ్ స్టొరీ ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని ఉన్న సినిమా… హీరో అండ్ హీరోయిన్స్ అందరి పెర్ఫార్మెన్స్ ఆకట్టుకోగా మిగిలిన స్టార్ కాస్ట్ కూడా బాగా నటించారు.

సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా థీం కి తగ్గట్లు మెప్పిస్తుంది, ఎడిటింగ్ కూడా బాగానే ఉండగా అక్కడక్కడా కొంచం బోర్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాటోగ్రఫీ బాగుంది… ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇక డైరెక్టర్… రవికాంత్ మొదటి సినిమా క్షణం రేంజ్ లో స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయకున్నా…

అందులో ఉన్న కాలేజ్ లవ్ స్టొరీ థీం ని కొంచం బెటర్ వర్షన్ గా మార్చి నేటి యూత్ కి మరింత కనెక్ట్ అయ్యే సీన్స్ ని రాసుకున్నాడు. అది చాలా వరకు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉండగా సినిమా మొత్తం సింపుల్ గా సాగుతూ చివరికి మంచి ఎండింగ్ తో ముగుస్తుంది. కానీ లాజికల్ గా చూస్తె…

హీరో మోటో ఏంటి అనేది క్లియర్ గా చెప్పలేక పోయాడు…అలాగే తన పాత్రను మరింత ఎంటర్ టైన్ మెంట్ గా చెప్పి ఉంటే సినిమా మరింత బాగా మెప్పించేది. హీరోయిన్స్ ముగ్గురూ మెప్పించాగా షాలిని కి ఎక్కువ మార్కులు పడ్డాయి. 2 గంటల లెంత్ మాత్రమె ఉన్న సినిమా…

చాలా వరకు మెప్పించి ఆకట్టుకునేలా ముగిసింది అని చెప్పాలి. అక్కడక్కడా కొన్ని రోమాన్స్ సీన్స్ అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇబ్బంది పెట్టినా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడదగ్గ సినిమా నే కృష్ణ అండ్ హిస్ లీల… కాంప్లికేషన్స్ తో కూడుకున్న ట్రై యాంగిల్ లవ్ స్టొరీ అయిన…

కృష్ణ అండ్ హిస్ లీల OTT లో రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల్లో బెటర్ మూవీ గా చెప్పుకోవచ్చు. ముందుగా చెప్పినట్లు హీరో రోల్ ని మరింత బాగా డిసైన్ చేసుకుని ఉంటే మరింత బాగుండేది. ఓవరాల్ గా సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్… ఖాళీ టైం లో ఈజీగా ఒకసారి సినిమా చూసేయోచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here